ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వచ్చే నెలలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 150వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తుందని ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు తెలిపారు.
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వచ్చే నెలలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 150వ జయంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహిస్తుందని ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు తెలిపారు. ఆయన న్యూఢిల్లీలోని ఇందిరాభవన్లో ఏపీలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ ఎస్సీ సెల్ సభ్యులతో చైర్మన్ శనివారం భేటీ అయ్యారు. అంబేద్కర్ను సొంతం చేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని, అదే అజెండాతో పార్టీ దళిత విభాగాలు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అక్టోబర్లో విశాఖపట్నంలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పాల్గొంటారని కొప్పులరాజు నేతల భేటీలో వెల్లడించారు.