సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లను ప్రారంభించింది, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేసింది దామోదరం సంజీవయ్యేనని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. సింగరేణిలో బోనస్ విధానాన్ని అమలు చేసి బోనస్ సంజీవయ్య అని పేరు తెచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో విప్లవాత్మక విధానాలు, పథకాలను ప్రజల కోసం తీసుకొచ్చారని చెప్పారు.
ఉమ్మడి ఏపీ సీఎం, ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు అధ్యక్షతన ఇందిరాభవన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సంజీవయ్య జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తానే ముఖ్యమంత్రి అయి కేసీఆర్ మోసం చేస్తే దేశంలోనే తొలి దళిత సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.
కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని జగన్‌ను కోరతా: గద్దర్
కాంగ్రెస్ పార్టీ ఉదారమైన పార్టీ అని, ఆ పార్టీలో ఎంతో మంది త్యాగధనులున్నా రని, వారి త్యాగాలకు వెలకట్టలేం కానీ విలువ కట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని ఏపీ సీఎం జగన్‌ను కలిసి కోరతానన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, కాం గ్రెస్ నేత పొన్నాల, కోదండరెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్, వినోద్ కుమార్, సంజీవయ్య సోదరుడు నాగేందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment