Old age pensions
-
జార్ఖండ్‌లో 50 ఏళ్లకే పెన్షన్
రాంచీ: పెన్షన్ల మంజూరు విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజనులు, దళితులకు పెన్షన్ అర్హత వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు తగ్గించింది. 50 ఏళ్ల వయసు రాగానే పెన్షన్ ప్రయోజనాలు అందుకోవచ్చని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలో జేఎంఎం కూటమి ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు, దళితుల్లో మరణాల రేటు అధికంగా ఉందని, 60 ఏళ్లు దాటాక వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడం లేదన్నారు. గిరిజనులు, -
AP: అవ్వాతాతల పింఛను రూ.3వేలకు పెంపు
సాక్షి, అమరావతి: అవ్వాతాతలతో పాటు వితంతు, ఒంటరి మహిళ, వివిధ రకాల చేతి వృత్తిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించనుంది. వీరికి ప్రతినెలా ఇచ్చే సామాజిక పింఛను మొత్తాన్ని రూ.2,750 నుంచి రూ.3,000కు పెంచనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనల తుది ఆమోదం ఫైలు శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. నిజానికి.. 2024 జనవరి నుంచి పింఛన్ మొత్తాన్ని రూ.3,000కు పెంచనున్నట్లు ముఖ్యమంత్రి నెలన్నర క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ల పంపిణీ కోసం రూ.1,800 కోట్లకు పైగా ఖర్చుచేస్తుండగా.. జనవరి నుంచి జరిగే పెంపు అనంతరం అది దాదాపు రూ.2,000 కోట్లకు పెరిగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 65,33,781 మంది లబ్ధిదారులు పింఛన్లు పొందారు. బాబు జమానాలో అవస్థలే.. వాస్తవానికి.. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో అవ్వాతాతల పింఛన్ల కోసం సరాసరిన ప్రతినెలా పెట్టిన ఖర్చు కేవలం రూ.400 కోట్లు మాత్రమే. అలాగే, అప్పట్లో అర్హత ఉన్న వారికి కొత్తగా పింఛను మంజూరు కావాలన్నా.. మంజూరైన పింఛను ప్రతినెలా తీసుకోవాలన్నా లబ్ధిదారుల అవస్థలు అంతాఇంతా కాదు. ఆ తర్వాత.. అంటే నాలుగున్నర ఏళ్ల క్రితం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత సామాజిక పింఛనుదారులకు స్వర్ణయుగమే అని చెప్పాలి. ఎందుకంటే.. రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న ప్రతి పది మందిలో దాదాపు నలుగురికి వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కొత్తగా పింఛన్లు మంజూరైనవేనని.. ఈ కాలంలో 28,26,884 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు వివరిస్తున్నారు. మరోవైపు.. పింఛన్ల పంపిణీలో జగన్ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ప్రతీనెలా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ మధ్య ఠంఛన్‌గా లబ్ధిదారుల ఇళ్లకు వలంటీర్లు పొద్దున్నే వెళ్లి పింఛను డబ్బులు అందజేసే విధానానికి శ్రీకారం చుట్టారు. పొదుపు మహిళలకు మంచినీటి కుళాయి ఏర్పాటు పనులు.. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్రామాల్లో ఇంటింటికీ మంచినీటి కుళాయిల ఏర్పాటుచేసే మరో కీలక కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటిదాకా కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో జరిగే ఈ పనులను ఇప్పుడు కొత్తగా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ (సీసీఎస్)లో ఆయా గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళలతో కూడిన కమిటీలకే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కమిటీలను గ్రామ జలసంఘం పేరుతో పిలుస్తారు. దీనికి సంబంధించి ప్రతిపాదనల ఫైలు కూడా శుక్రవారం నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియలో.. మహిళా కమిటీలపై ఎలాంటి ముందస్తు ఆర్థిక భారంపడే అవకాశం లేకుండా.. ఈ పనులకు అవసరమైన పైపులైన్లు, కుళాయి సామాగ్రిని ప్రభుత్వమే ముందుగా ఆ కమిటీలకు ఇచ్చే అవకాశముందని అధికారులు వివరిస్తున్నారు. ఇదీ చదవండి: పేదల చదువులపై పిచ్చి ప్రేలాపనలు -
సమస్యల ‘వాణి’ కి అందిన 400 దరఖాస్తులు..
కరీంనగర్: కలెక్టరేట్ సముదాయంలో సోమవారం జనసందోహం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుందన్న సమాచారంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి, తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అత్యధికంగా భూ సమస్యలు, పింఛన్లు, రేషన్ కార్డులు, దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి 400కు పైగా దరఖాస్తులు రాగా ఆన్లైన్, మాన్యువల్‌గా స్వీకరించారు. కలెక్టర్ బి.గోపి, అదనపు కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్ పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. భూమి విషయంలో బెదిరిస్తున్నడు ఏళ్లుగా భూమిని అనుభవిస్తున్నం. పంటల సాగుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నం. కానీ మా భూమితో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అతని భూమి అంటూ మమ్మల్ని బెదిరిస్తున్నడు. సర్వే నంబర్ 126బి/3, 126ఎ/3 తదితర సర్వే నంబర్లలో మా భూమి ఉంది. అధికారులు న్యాయం చేయాలి.– బండారి కుటుంబసభ్యులు, చామనపల్లి, కరీంనగర్ రూరల్ పట్టాదారు పేరు మార్చండి చల్లూరు గ్రామంలో సర్వే నంబర్ 91, 728/2లో మూడెకరాల భూమి ఉంది. భూ రికార్డుల్లో తాతల కాలం నుంచి మేమే ఉన్నాం. కానీ సంబంధం లేని వ్యక్తి పేరిట మార్చారు. ఈ విషయంలో గత కొన్నేళ్లుగా తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. అయినా స్పందన లేదు. అధికారులు మోకాపై విచారణ జరిపి, న్యాయం చేయాలి. – గాజుల ప్రసాదరావు, చల్లూరు, వీణవంక వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్ వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి మాది కరీంనగర్‌లోని 42వ డివిజన్. కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇప్పుడు శరీరం సహకరించడం లేదు. పని చేయాలంటే చేతకాని పరిస్థితి. వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని మూడేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న. రేపుమాపంటూ తిప్పుకుంటున్నరు. – బాసం మల్లయ్య, ప్రశాంత్‌నగర్, కరీంనగర్ పరిహారం ఇయ్యలే.. మాది కొత్తపల్లి మండలంలోని ఎలగందుల గ్రామం. మా ఇల్లు ఎస్సారెస్పీ ముంపునకు గురైంది. సర్వే నంబర్ 271లో ఇంటి నంబర్ 10–84 కాగా పరిహారం ఇచ్చే సమయంలో నా సోదరికి పక్షవాతం రావడంతో ఆస్పత్రిలో ఉన్నారు. అధికారులు కాలయాపన చేస్తున్నరు. – గడ్డం ఆంజనేయులు, రేకుర్తి, కరీంనగర్ -
ప్రజల మనిషి సంజీవయ్య
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లను ప్రారంభించింది, అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేసింది దామోదరం సంజీవయ్యేనని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు గుర్తు చేశారు. సింగరేణిలో బోనస్ విధానాన్ని అమలు చేసి బోనస్ సంజీవయ్య అని పేరు తెచ్చుకున్నారన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో విప్లవాత్మక విధానాలు, పథకాలను ప్రజల కోసం తీసుకొచ్చారని చెప్పారు. ఉమ్మడి ఏపీ సీఎం, ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు సంజీవయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు అధ్యక్షతన ఇందిరాభవన్‌లో సోమవారం ఘనంగా జరిగాయి. శ్రీధర్‌బాబు మాట్లాడుతూ సంజీవయ్య జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తి కావాలని ఆకాంక్షించారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని తానే ముఖ్యమంత్రి అయి కేసీఆర్ మోసం చేస్తే దేశంలోనే తొలి దళిత సీఎంను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. కర్నూలు జిల్లాకు సంజీవయ్య పేరు పెట్టాలని జగన్‌ను కోరతా: గద్దర్ కాంగ్రెస్ పార్టీ ఉదారమైన పార్టీ అని, ఆ పార్టీలో ఎంతో మంది త్యాగధనులున్నా రని, వారి త్యాగాలకు వెలకట్టలేం కానీ విలువ కట్టాలని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని ఏపీ సీఎం జగన్‌ను కలిసి కోరతానన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి, కె.శ్రీనివాస్, కాం గ్రెస్ నేత పొన్నాల, కోదండరెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్, వినోద్ కుమార్, సంజీవయ్య సోదరుడు నాగేందర్ పాల్గొన్నారు. -
Aasara Pension: 30 వరకు పింఛన్ల దరఖాస్తుకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశమిచ్చింది. ఈ ఆసరా పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరంభించింది. గత ఆగస్టు 31 నాటికే కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసినా, అర్హులందరికీ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నెల 11 నుండి 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమీషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అర్హులైనవారు ఈ నెల 11 నుంచి ఈసేవ, మీసేవ ద్వారా నిర్ణీత నమూనా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఈనెల 30 వరకు అందిన దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని, సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పుట్టినతేదీ ధ్రువీకరణ, ఓటర్ కార్డు తదితర పత్రాలను దరఖాస్తుతోపాటు జత చేయాలన్నారు. కాగా, ఈ దరఖాస్తులకు ఈ సేవ, మీ సేవల్లో సేవల రుసుములు తీసుకోవద్దని, సంబంధిత రుసుములను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. -
31లోగా వృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తులు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 57 ఏళ్లకు తగ్గించిన నేపథ్యంలో.. కొత్తగా పింఛన్లకు అర్హత ఉన్న వారు ఆగస్టు 31 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన వారంతా మీ–సేవ/ఈ–సేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాల కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ పింఛన్లు పొందే అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. లబ్ధిదారుల ఎంపికలో పాటించాల్సిన ప్రమాణాలను ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వయసు నిర్ధారణకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు, పాఠశాల బదిలీ సర్టిఫికెట్లు, వయ సు నిర్ధారణ చేసే విద్యా సంస్థల సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. దరఖాస్తులో కులం, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంక్ పేరు, బ్రాంచి పేరు తదితర వివరాలు ఇవ్వాలని పేర్కొంది. మీ–సేవ/ఈ–సేవ కేంద్రాల్లో ఈ దరఖాస్తులకు ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని ఈ–సేవ కేంద్ర కమిషనర్‌కు సూచించింది. కాగా, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసు తగ్గించినందున, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
అవ్వా తాతలకు వైఎస్సార్ పెన్షన్ కానుక
సాక్షి, అమరావతి : అవ్వా తాతలకు శుభవార్త. ముఖ్యమంత్రిగా గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక వృద్ధ్యాప్య పెన్షన్‌ను నెలకు రూ.2,250లకు పెంచే ఫైలుపై ఆయన సీఎంగా తొలి సంతకం చేశారు. ఆ సంతకాన్ని తక్షణమే అమలుచేస్తూ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఉత్తర్వులు జారీచేశారు. వృద్ధాప్య పెన్షన్ పొందడానికి గరిష్ఠ వయో పరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించారు. వితంతవులు, గీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.2,250కు పెంచారు. వికలాంగులకు ఇచ్చే పెన్షన్‌ను రూ.మూడు వేలకు పెంచారు. ప్రస్తుతం డయాలసిస్ రోగులకు నెలకు రూ.3,500 చొప్పున పెన్షన్ ఇస్తున్నారు. దాన్ని రూ.పది వేలకు పెంచారు. ఈ పెన్షన్ల పెంపును తక్షణమే వర్తింపజేశారు. అంటే.. పెంచిన పెన్షన్‌ను జూలై 1న పంపిణీ చేస్తారు. ఈ పథకానికి వైఎస్సార్ పెన్షన్ కానుకగా ప్రభుత్వం నామకరణం చేసింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక చేసిన తొలి సంతకాన్ని అమలుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఎన్నికల ప్రచారంలోనూ నవరత్నాల్లో భాగంగా పెన్షన్‌ను రూ.మూడు వేలకు పెంచుకుంటూ పోతామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలుచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి సంతకం చేయడంపై అవ్వాతాతల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వికలాంగులను ప్రస్తుతం రెండు కేటగిరీలుగా విభజించి పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఇకపై వారిని ఒకే కేటగిరి కిందకు తెచ్చి నెలకు రూ.మూడు వేల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తారు. అలాగే, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.3500 నుంచి రూ.పది వేల చొప్పున పెన్షన్ ఇవ్వనున్నారు. పెంచిన పెన్షన్‌ను వృద్ధాప్య, వికలాంగ, వితంతు, ఒంటరి మహిళ, డయాలసిస్ విభాగాల్లో 53,32,593 మందికి పంపిణీ చేస్తారు. కాగా, పెన్షన్ల పెంపు జూన్ నుంచి అమల్లోకి వస్తుందని.. జూలై నుంచి పెరిగిన రూ.250తో కలిపి మొత్తం రూ.2,250 చెల్లిస్తారని సెర్ప్ అధికారులు తెలిపారు. మే నెలకు సంబంధించిన పెన్షన్లు జూన్ ఒకటవ తేదీ నుంచి పంపిణీ జరుగుతుందని.. అలాగే, జూన్ నెల పెన్షన్లు జులై ఒకటవ తేదీ నుంచి పంపిణీ జరుగుతుందని వారు వివరించారు. కాగా, జూన్ నెల నుంచి పంపిణీ జరిగే మే నెల పెన్షన్ల నిధులు రూ.1,094.91కోట్లను గురువారమే మండలాల వారీగా ఆయా ఎంపీడీవోల ఖాతాలకు జమచేసినట్లు అధికారులు చెప్పారు. -
అవ్వా,తాతలకు 3 వేల పింఛన్: వైఎస్ జగన్
-
ప్రజాసంకల్పయాత్ర ఎఫెక్ట్.. పింఛన్ల రెట్టింపు
-
వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ‘ఆరోగ్య శ్రీ’
-
దేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా ఉచిత వైద్యం
సాక్షి, తెనాలి: ఏ రాష్ట్రమూ కనీవినీ ఎరుగని రీతిలో ఆరోగ్య సంరక్షణా పథకాలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తానని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటిచ్చారు. పేదలు ఎవరైనా.. దేశంలోని ఏ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నా ప్రభుత్వమే డబ్బులు చెల్లిస్తుందని, ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామని అన్నారు. మహానేత వైఎస్సార్ పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే, ఆయన తనయుడిగా జగన్ రెండు అడుగులు వేస్తాడని, నవరత్నాల్లో ఒకటైన వైఎస్సార్ ఆరోగ్య పథకాన్ని ఈ మేరకు అత్యున్నతంగా తీర్చిదిద్దామని, ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే ప్రభుత్వంలో ఇవన్నీ అమలవుతాయని జననేత పేర్కొన్నారు. 130వ రోజు ప్రజాసంకల్పయాత్రలో శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఏ ఊరికి వెళ్లినా, ఎంత ఖర్చైనా నాదీ బాధ్యత: ‘‘పిల్లలను ఉన్నత చదువులు చదివించినప్పుడో, కుటుంబీకులకు పెద్ద జబ్బు వచ్చినప్పుడో పేదలు అప్పులపాలవుతారని మహానేత వైఎస్సార్ అనేవారు. వాళ్ల జీవితాలు చెదిరిపోవద్దనే ఉద్దేశంతోనే ఆయన ‘ఆరోగ్య శ్రీ’ ప్రారంభించారు. కొన్ని వేల మంది ఆ పథకం ద్వారా ఆపరేషన్లు చేయించుకున్నారు. కానీ గత నాలుగేళ్లుగా పరిస్థితి దారుణంగా తయారైంది. ఆరోగ్య శ్రీ కార్డు పట్టుకుని హైదరాబాద్‌కు పోతే.. ఏపీ కార్డులు అక్కడ చెల్లవని అంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసింది మరెవరోకాదు చంద్రబాబు నాయుడే. ఆ దుర్మార్గపు పాలన ముగిసి, మంచి రోజులు వచ్చి, మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘ఆరోగ్య శ్రీ’ని సమున్నతంగా అమలుచేస్తాం. ఇప్పటికే ప్రకటించిన నవరత్నాల్లో ఈ విషయాన్ని పేర్కొన్నాం. ఈ సందర్భంగా ఇంకొన్ని అంశాలు హామీ ఇస్తున్నాను.. ►ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ►వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. ►దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి మందుల కోసం నెలనెలా రూ.10 వేలు సాయంగా ఇస్తాం. ►మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాం. ►ప్రతి మండల కేంద్రంలో కిడ్నీ పేషెంట్ల కోసం డయాలసిస్ సెంటర్లు, క్యాన్సర్ పేషెంట్ల కోసం కీమోథెరపీ సెంటర్లు ఏర్పాట్లు చేస్తాం ►ఆపరేషన్ పూర్తయిన తర్వాత వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరుకాబట్టి వారికీ నెల నెలా ఆర్థిక సాయం అందిస్తాం. పెన్షన్ అర్హత వయసు 60 ఏళ్లే: వృత్తి కూలీలకు 45 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని ఇదివరకే చెప్పాం. సాధారణ వృధ్ధాప్య పెన్షన్ల విషయంలోనూ అర్హత వయసు 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తామని మాటిస్తున్నా. వయసు పెరిగే కొద్దీ వైద్యం కోసం ఖర్చులు పెరుగుతాయి కాబట్టే ప్రతి అవ్వకు, తాతకు 60 ఏళ్ల నుంచే నెలకు రూ.2 వేలు పెన్షన్ ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లోని పేద మహిళలకు 45 ఏళ్లకే రూ.2 వేలు పెన్షన్ అందిస్తాం. ఇప్పుడు చెప్పినవే కాకుండా నవరత్నాల పథకాల్లో ఏవైనా మార్పులు, చేర్పులు సూచించాలనుకుంటే నేరుగా నన్నే కలవొచ్చు’’ అని వైఎస్ జగన్ చెప్పారు. -
పండుటాకు.. ఎండు రొట్టె..!
తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ కోసం వృద్ధులు పడుతున్న పాట్లకు సజీవ సాక్ష్యం ఈ చిత్రం. తమకు పింఛన్ రావడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి తమ గోడు చెప్పుకోవాలని నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి మల్లయ్య (75), అంజయ్య(80), రామస్వామి అమసమ్మ(74), సూసమ్మ (85) (తన భర్త ఫించన్ కోసం) హైదరాబాద్ వచ్చారు. సీఎంకు వినతిపత్రం ఇస్తే ఆయన స్పందించి పింఛన్ ఇప్పిస్తాడని కాళ్లీడ్చుకుంటూ వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. వారు ఇచ్చే వినతిపత్రం ముఖ్యమంత్రి తీసుకోరని, విచారణ కేంద్రంలో దానిని ఇవ్వాలని అక్కడివారు చెప్పడంతో చేసేదేమీ లేక అడ్కడ వినతిపత్రం ఇచ్చి నలుగురూ వెనుదిరిగారు. ఈ సమయంలో ఆకలికి తాళలేని ఓ అవ్వ తాను జోలిలో తెచ్చుకున్న ఎండిన రొట్టెను సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎదురుగా కూర్చుని తినింది. ఈ దృశ్యం అక్కడి వారి హృదయాలను కలచివేసింది. - సాక్షి, హైదరాబాద్ - ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్ -
కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘ఆసరా’ పథకం కొందరికి ఆనందం కలిగించగా.. మరికొందరిని నిరాశకు గురిచేసింది. అనర్హులంటూ భారీ సంఖ్యలో పింఛన్లలో కోతలు పెట్టడంతో గతంలో పింఛన్లు పొందిన అనేక మంది తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈసారి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అనేక మంది పింఛన్లకు దూరమయ్యారు. తాము అన్నిరకాలుగా పింఛన్లకు అర్హులమైనప్పటికీ తమ పేర్లను జాబితా నుంచి ఎందుకు తొలగించారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు పింఛన్లతో బతుకుపై భరోసా ఉండేదని, ఇప్పుడు భవిష్యత్తును తలుచుకుంటే తీవ్ర ఆందోళనగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వృద్ధాప్య పింఛన్లను ఐదు రెట్లు పెంచడం, వికలాంగుల పింఛన్లను మూడు రెట్లు పెంచడంపై ‘ఆసరా’ పథకం అర్హులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లుగా వచ్చిన పింఛన్ ఏ మూలకూ చాలదని ఇకపై ఎక్కువ మొత్తంలో పింఛన్ రానుండటంతో తాము ఎవరిపై ఆధారపడి బతకాల్సిన అవసరం లేకుండా పోయిందని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బతుకు బండి నడిచేదెలా మండలంలోని పీరంపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు శాగంటి ఎల్లమ్మ (70) భర్త చిన్నయ్య 15 ఏళ్ల క్రితం మృతిచెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులున్నా ఎవరూ ఎల్లమ్మను ఇప్పుడు ఆదరించడం లేదు. ఇన్నాళ్లు కూలీనాలి చేసుకొని బతికిన ఎల్లమ్మకు కొన్నాళ్లుగా కళ్లు సరిగా కనబడటం లేదు. ఇక గతంలో ఆమెకు వచ్చిన రూ. 200 పింఛన్ బతుకు బండి నడపడానికి ఆమెకు కొంత ఉపయోగపడేది. బుధవారం పింఛన్లు వస్తాయని తెలుసుకొని ఎల్లమ్మ పంచాయతీ కార్యాలయానికి చేరుకుంది. కాని జాబితాలో తన పేరు లేదని తెలుసుకున్న ఆమె తీవ్ర నిర్వేదానికి లోనయ్యింది. ఇకపై తన బతుకు ఎలా గడిపేదంటూ తీవ్రంగా రోదించింది. జాబితాలో సవరణలుంటాయని, భవిష్యత్తులో పింఛన్ వచ్చే అవకాశముందని స్థానికులు సర్దిచెప్పడంతో రోదిస్తూనే ఎల్లమ్మ ఇంటిముఖం పట్టింది. -కుల్కచర్ల ఆసరా కోసం ఆవేదన పింఛన్ మంజూరు కాలేదని ఆవేదనకు గురైన కొందరు ఎంపీడీఓ కార్యాల యానికి వచ్చి అధికారులను నిలదీశారు. తమకు అన్ని అర్హతలున్నా.. పింఛన్ ఎందు కు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని సిరిపూరం, పంచలిం గాల గ్రామాల్లో బుధవారం స్థానిక ఎమ్మె ల్యే సంజీవరావు చేతులమీదుగా ఆసరా పథకాన్ని ప్రారంభించారు. మిగితా గ్రామా ల్లో గురువారం పింఛన్లు పంపిణీ చేస్తామం టూ అర్హుల జాబితాను ఆయా గ్రామ పం చాయతీల్లో అందుబాటులో ఉంచారు. అ యితే జాబితాలో పేరు లేని కొందరు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకుది గారు. తమకు అన్ని అర్హతలున్నా.. పింఛన్ ఎందుకు మంజూరు చేయలేదో వివరించాలంటూ అధికారులను నిలదీశారు. -మర్పల్లి గతంలో పింఛను వచ్చేది ఇప్పుడు పేరులేదు అధికారులు వారి తప్పిదాలతో మాలాంటి వికలాంగులను ఇబ్బంది పెడుతున్నారు.నాకు కొన్నేళ్లుగా పింఛన్ వస్తోంది. ఈసారి మాత్రం జాబితాలో నా పేరు లేదని అధికారులు చెబుతున్నారు. చాలామంది వికలాంగులు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వికలాంగులను ఇబ్బందులకు గురిచేయవద్దు. వారికి తగిన న్యాయం చేయాలి. - మోసిన్, వికలాంగుడు, గండేడ్ 58 శాతంవైకల్యం ఉన్నా.. ప్రభుత్వం కనీసం 40 శాతం వైకల్యం ఉంటే వారికి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. 2007 నుంచి నాకు వికలాంగుల పింఛన్ అందుతోంది. నాకు 58 శాతం వైకల్యం ఉంది. అయినా నాకు పింఛన్ రాలేదు. పింఛన్ ఇస్తారన్న ఆశతో ఉదయం నుంచి పంచాయతీ కార్యలయం వద్ద పడిగాపులుగాస్తున్నా. చివరకు నాకు పింఛన్ రాదు పొమ్మని చెబుతున్నారు. -ఎర్రోల్ల సుధాకర్, సిరిపూరం(మర్పల్లి) -
అట్ల ఇచ్చె.. ఇట్ల గుంజుకునె!
వరంగల్/నిజామాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు తయారైంది పింఛ న్ల పంపిణీ! దిక్కుమొక్కూ లేని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ డబ్బులను పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. ఎన్నో సర్వేలు, వడపోతలు, ఎంతో ఎదురుచూపుల తర్వాత చేతికందుతున్న పింఛన్ సొమ్ము నుంచి.. నల్లా బిల్లు, ఇంటి బిల్లు, ఇతర బిల్లులు అంటూ డబ్బులు గుంజుకుంటున్నాయి. వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లోని అనేక గ్రామపంచాయతీల్లో ఈ తంతు కొనసాగింది. దీంతో పింఛన్ సొమ్ము అందిందన్న లబ్ధిదారుల ఆశ అక్కడికక్కడే ఆవిరవుతోంది. వరంగల్ జిల్లా రఘునాథపల్లి, ధర్మసాగర్, కేసముద్రం మండలాల పరిధిలోని గ్రామా ల్లో పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు... పింఛన్ లబ్ధిదారుల నుంచి ముక్కుపిండి నల్లా, ఇల్లు తదితర పన్నులు వసూలు చేశారు. దీన్ని ధర్మసాగర్ ఎంపీడీవో రాజారావు దృష్టికి తీసుకురాగా...పింఛన్ల నుంచి పన్నుల వసూళ్లు ఆపాలని కార్యదర్శులను ఆదేశించినట్లు వెల్లడించారు. ఇక నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మల్ పంచాయతీ... ‘పింఛన్ వచ్చిన వారు పన్ను కట్టగలరు’ అంటూ కార్యాలయం ఎదుట నోటీసు అంటించారు. రశీదులు చింపి ఇచ్చిండ్రు ప్రభుత్వం రెండు నెలల పింఛన్ ఒకేసారి ఇస్తే... ఇంటి పన్ను పాతది, కొత్తది ఒకేసారి తీసుకున్నరు. రూ.3 వేలలో.. పన్నులు రూ.960 కట్టుకుని రశీదులు ఇచ్చిండ్రు. ‘ఇదేమిటి... ఊళ్ల ఉండనట్టే ఒకేసారి పన్ను తీసుకుంటారా..’ అని అడిగితే పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ చెప్పిం డ్లని, మాదేం లేదని సిబ్బంది అంటున్నారు. - సిద్ధిరాములు, రఘునాథపల్లి, వరంగల్ -
కుటుంబంలో ఒకళ్లకే వృద్ధాప్య పింఛను: కేటీఆర్
కుటుంబంలో ఇద్దరు వృద్ధులుంటే ఒకళ్లకు మాత్రమే వృద్ధాప్య పింఛను వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా శనివారం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. ఆసరా పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ప్రారంభిస్తారని తెలిపారు. నెలాఖరు వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పింఛను వస్తుందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే తమకు 44 లక్షల దరఖాస్తులు వచ్చాయని, పింఛను కార్యక్రమానికి మొత్తం 3 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని ఆయన వివరించారు. -
65 ఏళ్లు లేకపోతే వృద్ధాప్య పింఛన్ కట్
కేంద్రం ఆదేశాలు ఏపీ సర్కార్ బేఖాతరు హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్ల భారాన్ని భారీగా తగ్గించుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎత్తు వేసింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ధిక్కరిస్తూ పేదలకు వృద్ధాప్య పింఛన్ మంజూరుకు 65 సంవత్సరాల నిబంధనను పెట్టింది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 60 సంవత్సరాల నుంచి పెన్షన్‌ను మంజూరు చేస్తూ మరోవైపు పేదల్లోని వృద్ధులకు మాత్రం 65 సంవత్సరాల నిబంధనల విధించడం ఎంతవరకు సమంజసం అని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది తప్ప పేదల్లోని వృద్ధుల పట్ల సానుభూతితో వ్యవహరించడం లేదని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.