కుటుంబంలో ఒకళ్లకే వృద్ధాప్య పింఛను: కేటీఆర్
కుటుంబంలో ఇద్దరు వృద్ధులుంటే ఒకళ్లకు మాత్రమే వృద్ధాప్య పింఛను వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా శనివారం నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు. ఆసరా పేరిట నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్నగర్ జిల్లా కొత్తూరులో ప్రారంభిస్తారని తెలిపారు.
నెలాఖరు వరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పింఛను వస్తుందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే తమకు 44 లక్షల దరఖాస్తులు వచ్చాయని, పింఛను కార్యక్రమానికి మొత్తం 3 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని ఆయన వివరించారు.