పండుటాకు.. ఎండు రొట్టె..! | age old people strive for pensions in telangana | Sakshi
Sakshi News home page

పండుటాకు.. ఎండు రొట్టె..!

Published Tue, Apr 14 2015 9:54 AM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

పండుటాకు.. ఎండు రొట్టె..!

పండుటాకు.. ఎండు రొట్టె..!

తెలంగాణ రాష్ట్రంలో పింఛన్‌ కోసం వృద్ధులు పడుతున్న పాట్లకు సజీవ సాక్ష్యం ఈ చిత్రం. తమకు పింఛన్ రావడం లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి తమ గోడు చెప్పుకోవాలని నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి మల్లయ్య (75), అంజయ్య(80), రామస్వామి అమసమ్మ(74), సూసమ్మ (85) (తన భర్త ఫించన్ కోసం) హైదరాబాద్ వచ్చారు. సీఎంకు వినతిపత్రం ఇస్తే ఆయన స్పందించి పింఛన్ ఇప్పిస్తాడని కాళ్లీడ్చుకుంటూ వచ్చిన వారికి నిరాశే ఎదురైంది.

వారు ఇచ్చే వినతిపత్రం ముఖ్యమంత్రి తీసుకోరని, విచారణ కేంద్రంలో దానిని ఇవ్వాలని అక్కడివారు చెప్పడంతో చేసేదేమీ లేక అడ్కడ వినతిపత్రం ఇచ్చి నలుగురూ వెనుదిరిగారు. ఈ సమయంలో ఆకలికి తాళలేని ఓ అవ్వ తాను జోలిలో తెచ్చుకున్న ఎండిన రొట్టెను సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎదురుగా కూర్చుని తినింది. ఈ దృశ్యం అక్కడి వారి హృదయాలను కలచివేసింది.
 - సాక్షి, హైదరాబాద్
 - ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement