హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీవ్రతరం చేయాలని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఈ ఎజెండాతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగింపు పై కసరత్తు చేయాలని ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస సమన్వయ కమిటీ భేటీకి సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది.