coordination committee
-
భోపాల్‌లో ‘ఇండియా’ మొట్టమొదటి ర్యాలీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల ఇండియా కూటమి తమ మొట్టమొదటి బహిరంగసభను వచ్చే నెలలో భోపాల్‌లో నిర్వహించనుంది. అదేవిధంగా, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపిణీకి సంబంధించిన చర్చలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించనుంది. ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం బుధవారం ఢిల్లీలో జరిగింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ భేటీకి కమిటీలోని 14 మంది సభ్యులకు గాను 12 మంది హాజరయ్యారు. సనాతనధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల దుమారం నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అనంతరం మాట్లాడుతూ, విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భేటీకి రాలేదని చెప్పారు. హాజరైన వారిలో..ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ నుంచి కేసీ వేణుగోపాల్, జార్ఖండ్ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి.రాజా, ఎస్పీ నుంచి జావెద్ అలీ ఖాన్, డీఎంకే నుంచి టీఆర్ బాలు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, జేడీయూకు చెందిన సంజయ్ ఝా, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, శివసేన(యూబీటీ)కి చెందిన సంజయ్ రౌత్ ఉన్నారు. ‘సీట్ల పంపకాల ప్రక్రియను ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయించింది. భాగస్వామ్య పక్షాలు చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా సీట్ల పంపణీని ఖరారు చేయాలి.. కూటమి ఉమ్మడి సమావేశాలను దేశవ్యాప్తంగా చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటి సభను అక్టోబర్ మొదటి వారంలో భోపాల్‌లో చేపట్టాలని అంగీకారానికి వచ్చారు. బీజేపీ పాలనలో పెరిగిన అవినీతి, నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం ప్రధాన ఎజెండాగా ఈ సభలు జరుగుతాయి’అని కమిటీ ఉమ్మడి ప్రకటనను వేణుగోపాల్ చదివి వినిపించారు. మహారాష్ట్ర, తమిళనాడు, బిహార్‌ల్లో సీట్ల పంపకం సులువుగా కనిపిస్తుండగా, పంజాబ్, ఢిల్లీ, పశి్చమబెంగాల్ల్లో మాత్రం భాగస్వామ్య పక్షాల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
నేడు ఇండియా కూటమి సమన్వయ కమిటీ భేటీ.. ప్రధాన సవాళ్లు ఇవే..
ఢిల్లీ: నేడు సాయంత్రం ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశం కానుంది. 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ , ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై చర్చించనున్నారు. కూటమి ముందున్న ప్రధాన సవాళ్ళు ఇవే.. ప్రధానమంత్రి అభ్యర్థి.. కేంద్రంలో ఉన్న బీజేపీని ఎదుర్కొనడానికి దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు కలిసి కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. దాదాపు 28 పార్టీలు కూటమిలో ఉన్నాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి కూటమి తరపున ఒక ప్రధాన అభ్యర్థిని ప్రధాని మోదీకి అభిముఖంగా నిలబెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఏ పార్టీకి ఇబ్బంది లేకుండా, అన్ని పార్టీల అంగీకరంతో ఓ అభ్యర్థిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇదే కూటమి ముందు ఉన్న ప్రధాన సవాళుగా పేర్కొనవచ్చు. టికెట్ల పంపిణీపై కుదరని ఏకాభిప్రాయం ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆప్ లాంటి జాతీయ పార్టీలతో పాటు అనేక చిన్ని పార్టీలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ప్రాబల్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు పోటీ చేయకుండా ఆయా స్థానాల్లో ప్రాంతీయ పార్టీలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలనే అంశంలో కూటమి పెద్దలు ఇప్పటికే తలమునకలయి ఉన్నాయి. ఈ అంశంలో సమన్వయ కమిటీ ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. దీనిపై నేడు భేటీలో చర్చించనున్నారు. #WATCH | Mumbai, Maharashtra: Shiv Sena (UBT) leader Sanjay Raut says, "Today we will go to the meeting... The agenda decided in the Mumbai meeting will be discussed. Everybody is going to attend the meeting except TMC. TMC leader Abhishek Banerjee is a member of this committee,… pic.twitter.com/FglophdMXr — ANI (@ANI) September 13, 2023 టీఎంసీ Vs కాంగ్రెస్, లెఫ్ట్: అటు.. పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ , కాంగ్రెస్ కు సీట్లు కేటాయించేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. అధికారంలో ఉన్న టీఎంసీ బెంగాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకోగలిగే సత్తా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు, లెఫ్ట్‌లకు సీట్లను కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పటికే అక్కడ జరిగిన స్థానిక పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీ సత్తా చాటింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రభంజనం సృష్టించగల విశ్వాసంతో ఉంది. లెఫ్ట్ Vs కాంగ్రెస్: కేరళలోనూ ఇదే తరహా వివాదం నెలకొంది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. అధికారంలో ఉన్న పీనరయ్ విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ పార్టీ నేతలు.. తాము సొంతంగా మెజారిటీ సీట్లను సాధించగలమని భావిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు సీట్ల పంపిణీపై నిరాసక్తతతో ఉన్నారు. ఆప్ Vs కాంగ్రెస్: ఢిల్లీ, పంజాబ్ , హర్యానాలో టిక్కెట్ల పంపిణీ పై ఆప్ - కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొన్ని రోజులుగా కొనసాగుతోంది. ఇటీవలే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆప్.. మరిన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే పంజాబ్‌లో అధికారాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో సీట్ల పంపిణీ కూటమి ముందు ప్రధాన సమస్యగా మారింది. ఈ అంశాలపై నేటి సమావేశంలో చర్చించనున్నారు. ఇదీ చదవండి: ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం.. ఎజెండా ఏమిటంటే..? -
13న ‘ఇండియా’ సమన్వయ కమిటీ తొలి భేటీ
న్యూఢిల్లీ: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం ఈ నెల 13న ఢిల్లీలో జరుగనుంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో ఈ భేటీ జరుగుతుందని కూటమి నేతలు ఆదివారం వెల్లడించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. వివిధ పారీ్టలకు చెందిన 14 మంది నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో ఈ కమిటీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా పనిచేస్తోంది. -
ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ ఎప్పుడంటే..?
ఢిల్లీ: ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం ఈ నెల 13న జరగనుంది. దేశ రాజధానిలోని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఇంట్లో భేటీ కానున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా.. నేడు(మంగళవారం) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి ప్రచార కమిటీ మొదటిసారిగా సమావేశమవనుంది. ఇండియా కూటమికి ప్రచార కమిటీని 19 మందితో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం ఆ కమిటీకి మరో ఇద్దరు సభ్యులను కొత్తగా చేర్చారు. డీఎంకేకు చెందిన తిరుచి శివ, పీడీపీకి చెందిన మహబూబ్ బేగ్‌ను నూతనంగా ఆ కమిటీలో చేర్చారు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసి ఐక్యంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఇప్పటికే పాట్నా, బెంగళూరు, ముంబయిలో సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ భేటీల్లో కూటమి ఏర్పాటు, దాని నియమాలు, లక్ష్యాలపై చర్చించుకున్నారు. తాజాగా ముంబయిలో జరిగిన భేటీలో కూటమికి ఓ సమన్వయ కమిటీతో పాటు ప్రచార కమిటీని కూడా నియమించారు. ఇవి కూటమి సభ్యులను సమన్వయ పరచడంతోపాటు ఎన్నికల ప్రచార వ్యూహాలను నిర్ణయిస్తాయి. వచ్చే నెల నుంచి కూటమి చెందిన పార్టీల ప్రచారాలు ప్రారంభం కానున్నాయి. ఇదీ చదవండి: బీజేపీ vs ఇండియా: ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు.. కొనసాగుతున్న పోలింగ్ -
నేటి నుంచే... ‘ఇండియా’ మూడో భేటీ
ముంబై: జాతీయ స్థాయిలో అధికార బీజేపీకి ప్రత్యామ్నాయంగా పురుడు పోసుకున్న విపక్ష ‘ఇండియా’ కూటమి రెండు రోజుల కీలక సమావేశం మహారాష్ట్ర రాజధాని ముంబైలో గురువారం ప్రారంభం కానుంది. గ్రాండ్ హయత్ హోటల్లో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్‌తో పాటు 27 పార్టీలకు పైగా హాజరు కానున్నట్టు చెబుతున్నారు. కూటమి లోగోను, సమన్వయ కమిటీని ప్రకటించనున్నారు. కూటమి పక్షాలు అంతర్గత విభేదాలను పరిష్కరించుకోవడంతోపాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ఉమ్మడి ప్రచార వ్యూహానికి తుదిరూపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా తయారీకి కొన్ని కమిటీలను ప్రకటించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన ఉమ్మడి కార్యక్రమాలు, సీట్ల పంపకం కోసం కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించనున్నారు. భాగస్వామ్యపక్షాల మధ్య సమన్వయం కోసం దేశ రాజధాని ఢిల్లీలో ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేసుకోనున్నారు. దీనిపై ముంబై భేటీలో ప్రకటన చేసే అవకాశం ఉంది. కూటమి సమన్వయకర్త, లేదా చైర్‌పర్సన్‌ను ఎన్నుకోవడం గురించి కూడా చర్చ జరగనుంది. తిరోగమన విధానాలు అమలు చేస్తున్న అధికార ఎన్డీయేకు ప్రగతిశీల ప్రత్యామ్నాయాన్ని తెరపైకి తీసుకొస్తూ స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ముంబై భేటీలో ఖరారు చేయనున్నట్లు ఆర్జేడీ నేత మనోజ్ ఝా చెప్పారు. ’బీజేపీ వెళ్లిపో’ నినాదం ఇండియా కూటమిలో ప్రస్తుతం 26 పార్టీలు భాగస్వామిగా ఉన్నాయి. ముంబై భేటీ సందర్భంగా మరిన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చి చేరనున్నట్లు కూటమి నాయకులు చెబుతున్నారు. ఇండియా తొలి రెండు సమావేశాలు పాట్నా, బెంగళూరుల్లో జరిగిన విషయం తెలిసిందే. ముంబైలో గురువారం నుంచి జరుగనున్న మూడో భేటీకి హాజరయ్యేందుకు ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు నగరానికి చేరుకున్నారు. ఈ భేటీ వేదిక నుంచి ’బీజేపీ చలే జావ్’ (బీజేపీ వెళ్లిపో) అనే నినాదం ఇవ్వబోతున్నట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే చెప్పారు. ప్రధానమంత్రికి పదవికి అర్హులైన నాయకులు తమ కూటమిలో చాలామంది ఉన్నారని తెలిపారు. వారిలో శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని అన్నారు. ఇండియా పక్షాల నడుమ ‘కెమిస్ట్రీ’ మెరుగుపడుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మిలింద్ దేవ్రా వ్యాఖ్యానించారు. తమ కూటమిలో సీట్ల పంపకం రాష్ట్రాల స్థాయిలోనే జరుగుతుందని వివరించారు. కన్వీనర్‌గా నితీశ్! ఇండియా కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండియా కన్వీనర్‌గా బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నాయకుడు నితీశ్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కూటమి ఏర్పాటు వెనుక తనకు వ్యక్తిగత అ జెండా గానీ, ఆకాంక్షలు గానీ లేవని, కన్వీనర్ పోస్టుపై తనకు ఆసక్తి లేదని ఆయన ప్రకటించినప్పటికీ ఊహాగానాలు ఆగడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టే నేత నితీశ్‌కుమార్ మాత్రమేనని అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ పేరును మరికొందరు ప్రతిపాదిస్తున్నారు. ఆ పదవి పట్ల ఆమె విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. కన్వీనర్‌గా ఎవరుండాలో గురువారమే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. -
శాంతించిన సిద్ధూ..!
న్యూఢిల్లీ/చండీగఢ్: పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) అధ్యక్ష పదవికి అనుహ్యంగా రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఆయన గురువారం చండీగఢ్‌లోని పంజాబ్ భవన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతో భేటీ అయ్యారు. పంజాబ్‌లో డీజీపీ, అడ్వొకేట్ జనరల్ నియామకంపై సిద్ధూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఒక నియామకాన్ని నిలిపివేస్తామని సీఎం చన్నీ హామీ ఇవ్వడంతో సిద్ధూ మెత్తబడినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే ఒక సమన్వయ కమిటీని(కో–ఆరి్డనేషన్ ప్యానెల్) ఏర్పాటు చేసుకోవాలని ఇరువురూ నిర్ణయానికొచి్చనట్లు తెలిసింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి చన్నీ, పీసీసీ అధ్యక్షుడు సిద్ధూతోపాటు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధి ఒకరు సభ్యులుగా ఉంటారు. భవిష్యత్తులో ప్రభుత్వం ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా తొలుత కమిటీలో చర్చిస్తారు. ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతే నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఇద్దరు నేతల మధ్య 2 గంటలపాటు భేటీ జరిగింది. భేటీ తర్వాత చన్నీ, సిద్ధూ మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. అతిత్వరలో సీడబ్ల్యూసీ సమావేశం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశం అతిత్వరలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా గురువారం చెప్పారు. పార్టీలో ఇటీవలి కాలంలో లుకలుకలు, అసంతృప్త గళాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దడానికి సీడబ్ల్యూసీ భేటీ తక్షణమే నిర్వహించాలని సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగమైన సీడబ్ల్యూసీ సమావేశంపై అధినేత సోనియా గాంధీ ఇటీవలే సంకేతాలిచ్చారని రణదీప్ సూర్జేవాలా చెప్పారు. సీనియర్ నేత కపిల్ సిబల్ తాజాగా చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మరోవైపు, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అస్థిరత సృష్టిస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గురువారం ఆరోపించారు. -
‘కాళేశ్వరం’పై మరోసారి అంతర్రాష్ట్ర చర్చలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై మహారాష్ట్రతో మరోసారి అంతర్రాష్ట్ర చర్చలు జరగనున్నాయి. గతంలో మహారాష్ట్రలో జరిపిన ఒప్పందాల మేరకు జరుగుతున్న పనులు, ప్రస్తుత పరిస్థితులు, భూసేకరణ, అవసరమైన అనుమతులు, తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం తదితర అంశాలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. ఇరు రాష్ట్రాల చీఫ్ ఇంజనీర్లు, కలెక్టర్లతో కూడిన ఈ కమిటీ ఈ నెల 3న హైదరాబాద్‌లో సమావేశమై ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్చలు జరపనుంది. మహారాష్ట్రతో 2016 ఆగస్టులో కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణ ఒప్పందాల సందర్భంగా 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డలో నీటి నిల్వ, 148 మీటర్ల ఎత్తులో తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం, మేడిగడ్డతో భూ అవసరాలు, వాటి సేకరణ, అనుమతులు, వరద నివారణ చర్యలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇంటర్స్టేట్బోర్డు ఏర్పాటు చేసి అందులో చీఫ్ ఇంజనీర్ల స్థాయిలో సమన్వయ కమిటీ, సెక్రటరీల స్థాయిలో స్టాండింగ్ కమిటీ, ముఖ్యమంత్రుల స్థాయిలో బోర్డు ఏర్పాటు చేశారు. వార్ధాతో భూసేకరణ తగ్గే అవకాశం! మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రలో 453 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా, 40 ఎకరాల సేకరణ మాత్రమే మిగిలి ఉంది. దీనికి మహారాష్ట్ర సహకారం కోరాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీని 101 మీటర్ల లెవల్లో నిర్మించినా.. 100 మీటర్ల లెవల్లోనే నీటిని నిల్వ చేయాలని ఒప్పందం ఉంది. దీని నిర్మాణ పనుల తీరు, ఆమోదించిన డిజైన్స్‌పై మహారాష్ట్ర అడిగి తెలుసుకునే అవకాశముంది. తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలీ జిల్లాలోనే 509 ఎకరాలు ముంపు ఉండగా, ఆసిఫాబాద్ జిల్లాలో 300 ఎకరాల ముంపును అంచనా వేశారు. తమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణ ప్రాంతం రాష్ట్ర పరిధిలోని కవ్వాల్, మహారాష్ట్ర పరిధిలోని తడోబా వన్యప్రాణి ప్రాంతం పరిధిలో ఉంటోంది. దీంతో అటవీ అనుమతులతో పాటు వణ్యప్రాణి బోర్డు అనుమతులు తప్పనిసరి అయ్యాయి. అంతర్రాష్ట్ర ఒప్పందాల్లో భాగంగా తమ ప్రాంత భూములు ఇచ్చేందుకు మహారాష్ట్ర సమ్మతి తెలపడంతో పర్యావరణ, అటవీ అనుమతులు దక్కాయి. ఈ అనుమతుల అంశంతో పాటు ప్రస్తుతం తమ్మిడిహెట్టికి బదులుగా వార్ధా నదిపై చేపట్టాలనుకుంటున్న బ్యారేజీ అంశాలను చర్చించాలని నిర్ణయించారు. వార్ధా నదిపై బ్యారేజీ నిర్మాణం చేపడితే మహారాష్ట్రలో ఉండే ముంపు, భూసేకరణ, నీటి లభ్యత విషయంలో ఉన్న అనుమానాలపై తెలంగాణ ఇంజనీర్లు స్పష్టత ఇవ్వనున్నారు. తమ్మిడిహెట్టితో పోలిస్తే వార్ధా బ్యారేజీ నిర్మాణం చిన్నదైనందున భూసేకరణ చాలావరకు తగ్గే అవకాశం ఉంటుందని రాష్ట్ర ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ భేటీకి కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఆదిలాబాద్ సీఈ భగవంతరావు, ఆసిఫాబాద్, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, మహారాష్ట్ర తరఫున గడ్చిరోలీ, చంద్రాపూర్ జిల్లాల కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు హాజరుకానున్నారు. -
కోమటి బ్రదర్స్ వివాదం కొలిక్కి వచ్చినట్టేనా !
-
వంద వైఫల్యాలపై ఏం చెబుదాం?
* తెలుగుదేశంలో ‘గడపగడప’ కలవరం.. * చంద్రబాబు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ భేటీ సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలు.. ఆర్భాటంగా చేసిన ఐదు సంతకాలు హుష్‌కాకి.. హామీలన్నీ గాలికి... వీటన్నిటికి తోడు విచ్చలవిడి అవినీతి.. ఇదే సమయంలో వీటన్నిటినీ ఎండగట్టేందుకు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ‘గడపగడపకు వైఎస్సార్’ నినాదంతో భారీ కార్యక్రమం చేపట్టడం అధికార తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. దాంతో ఏం చేయాలనే దానిపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో సమావేశమయ్యారు. గుంటూరుజిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో గురువారంనాడు ఈ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలపై వంద ప్రశ్నలను తాము ప్రజల్లోకి తీసుకెళతామని వైఎస్సార్సీపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఆ ప్రశ్నల వివరాలు సేకరించి వాటికి సమాధానాలు ఇచ్చేలా నేతలు సిద్ధంగా కావాలని చంద్రబాబు సూచిం చారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయి నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్నీ సంపూర్ణంగా అమలు చేయలేకపోయామనే విషయాన్ని సమావేశంలో పాల్గొన్న నేతలు ప్రస్తావించగా చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనైనట్లు సమాచారం. మీరే ఇలా అంటే కిందిస్థాయి నేతలు ప్రజలకు ఏం చెప్తారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏం చెప్పాలో మీరే చెప్పండి... ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతామన్న ఒక్క వాగ్దానాన్నే అమలుచేశామని... అదికూడా వెనువెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉండదనే కారణంతో అమలు చేశాం తప్ప అంతకంటే ఏం చేయలేదని నేతలు చెప్పినట్లు తెలిసింది. దీన్ని ఇంకా ప్రభుత్వ రంగ సంస్థల వారికి అమలు చేయలేదనే అంశాన్ని ప్రస్తావించిన నేతలు ప్రజలకు, వైఎస్సార్సీపీ నేతలకు ఏం సమాధానం చెప్పాలో మీరే చెప్పండని అడిగినట్లు తెలిసింది. రుణమాఫీ, ఎన్టీఆర్ సుజలస్రవంతి, డ్వాక్రా రుణాల మాఫీ వంటివి కూడా సమగ్రంగా అమలు చేయలేదని, ఇవి సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే చేసిన తొలి ఐదు సంతకాల్లో ఉన్నాయని నేతలు ప్రస్తావించారు. ఇటువంటి వాటి విషయంలో తాము ప్రజలకు ఏం చెప్పాలో తెలియటం లేదని కూడా వారు అన్నట్లు తెలిసింది. అల్లరి చేసే యోచన... టీడీపీ బలంగా ఉన్న గ్రామాల్లో వైఎస్సార్సీపీని ప్రవేశించనివ్వకుండా అడ్డుకుని గడపగడపకూ కార్యక్రమాన్ని వివాదాస్పదం చేయాలని నేతలకు బాబు సూచించినట్లు తెలిసింది. దీని వల్ల ఘర్షణ వాతావరణం తలెత్తుతుందని, దాన్ని ఆసరాగా తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే పేరిట వైఎస్సార్ సీపీ నేతలను కట్టడి చేయవచ్చని అన్నట్లు సమాచారం. ముద్రగడ దీక్ష సమయంలో సాక్షి ఛానల్ ప్రసారాలను ఆపిన ట్లే వైఎస్సార్సీపీ కార్యక్రమం జరిగే సమయంలో ఏదో ఒక మిషతో ఆ ఛానల్ ప్రసారాలను నిలువరించాలని, పత్రికపై కూడా కేసులు నమోదు చేయటం ద్వారా అడ్డంకులు సృష్టించాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా, పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయంతో పాటు నేతలకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు సీనియర్ మంత్రులు, నేతలతో కమిటీని ఏర్పాటు చేశారు. గవర్నర్‌తో తాను జరిపిన చర్చల సారాంశాన్ని వివరించిన బాబు... నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించానని, దానిని సరైన సమయంలో వెల్లడిస్తానని, సరిగా పనిచేయని వారిపై చర్యలుంటాయన్నారు. ఆర్డీఓ, డీఎస్పీ స్థాయి అధికారుల బదిలీలను రష్యా పర్యటన తర్వాత చేపడతానని చెప్పారు. నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తానని తెలిపారు. -
వైఎస్సార్ సీపీ నియామకాలు
యలమంచిలి అదనపు కో ఆర్డినేటర్‌గా బొడ్డేడ పాయకరావుపేటకు నలుగురితో సమన్వయ కమిటీ విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ అదనపు కో ఆర్డినేటర్‌గా బొడ్డేడ ప్రసాద్‌ను నియమించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కో-ఆర్డినేటర్‌గా ప్రగడ నాగేశ్వరరావు వ్యవహరిస్తుండగా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బొడ్డేడ ప్రసాద్‌ను అదనపు కో ఆర్డి నేటర్‌గా నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక నుంచి నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను ప్రసాద్ కూడా పర్యవేక్షిస్తారు. అలాగే పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి నలుగురితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యేలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావులతో పాటు జెడ్పీలో పార్టీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు, సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణలతో ఈ కమిటీని ఏర్పాటుచేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం సాయంత్రం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగే పార్టీ కార్యక్రమాలను ఇక నుంచి ఈ నలుగురి సభ్యులతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుంది. -
ఏడాది ముందే అభ్యర్థుల ప్రకటన
♦ టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీలో నిర్ణయం ♦ జిల్లాల వారీగా పని విభజన, ఇన్చార్జీల నియామకం ♦ టికెట్ల కేటాయింపులో పీసీసీ, డీసీసీల అభిప్రాయం కీలకం సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికలకు ఏడాది ముందుగానే పార్టీ అభ్యర్థులను ప్రకటించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) సమన్వయ కమిటీ, కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం ఈ సమావేశాలు జరిగాయి. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఏఐసీసీ నేత శ్రీనివాసన్, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు. పార్టీలో సీనియ ర్లు, గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులకు ఏడాది ముందుగానే టికెట్లను ఖరారు చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులకే భవిష్యత్తులో టికెట్లు ఇవ్వాలని, టికెట్ల ఖరారులో పీసీసీ, డీసీసీల అభిప్రాయాలను కీలకంగా తీసుకోవాలని నిర్ణయించారు. వీటితోపాటు పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణా శిబిరాలు, క్రమశిక్షణ సంఘం పనితీరు వంటివాటిపై కీలక నిర్ణయాలను తీసుకున్నారు. జూన్ నెలాఖరులోగా మండల కమిటీల నియామకం ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను టీపీసీసీ నేతలు మల్లు రవి, దాసోజు శ్రవణ్, మహేశ్‌కుమార్ గౌడ్లు మీడియాకు వివరిం చారు. వీరు వెల్లడించిన వివరాల ప్రకారం ఉపాధ్యక్షుడి నేతృత్వంలో ముగ్గురు ప్రధాన కార్యదర్శులను జిల్లాల ఇన్‌చార్జీలుగా నియమించారు. జూన్ నెలాఖరులోగా అన్ని మండ ల కమిటీల నియామకాలు పూర్తిచేయాలి. బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలకు కాంగ్రెస్‌పార్టీ విధానాలు, సిద్ధాంతాలపైన రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తారు. నియోజకవర్గానికి 30 మంది చొప్పున పూర్తికాలం పార్టీ కార్యకర్తల జాబితా రూపొం దించి, మొత్తం 3,600 మందికి ఒకరోజు శిక్షణ ఇస్తారు. శిక్షణ కార్యక్రమంలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పాల్గొంటారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేవారు, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కఠినంగా వ్యవహరించడానికి క్రమశిక్షణ సంఘాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించారు. 2019 ఎన్నికలు లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజా క్షేత్రంలో పనిచేయడం వంటి కీలక నిర్ణయాలను తీసుకున్నట్టుగా టీపీసీసీ నేతలు వెల్లడించారు. -
పీఎంకేఎస్వైలో 11 రాష్ట్ర ప్రాజెక్టులు
సమన్వయ కమిటీ ప్రతిపాదనల్లో చేర్చాం: హరీశ్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు పలు ప్రతిపాదనలను రూపొందించిందని.. త్వరలోనే వాటిని కేంద్ర మంత్రి మండలికి అందజేయనుందని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో పీఎంకేఎస్‌వై సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పీఎంకేఎస్వైలో తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులు చేర్చాలని సిఫారసుల్లో చేర్చాం. మొత్తంగా ప్రాజెక్టులపై రాష్ట్రాలు-కేంద్రం మధ్య ఎంవోయూ జరిగిన వారంలోనే నిధులు విడుదల చేయాలి, ప్రాజెక్టు వ్యయంలో 60% గ్రాంటుగా ఇవ్వాలి, ఆపైన నాబార్డు నుంచి కేంద్రం హామీదారుగా ఉంటూ రుణం ఇప్పించాలి, ఆ రుణంపై వడ్డీని 4.5 శాతానికి తగ్గించాలి, సకాలంలో పూర్తయిన ప్రాజెక్టుల రుణంపై వడ్డీని కేంద్రమే భరించాలి, అంచనా వ్యయం 200% పెరిగిన ప్రాజెక్టులను సీడబ్ల్యూసీ పునఃపరిశీలించాలని ప్రతిపాదించాం. వాటి ని కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదించి నిధులు విడుదల చేస్తారని ఆశిస్తున్నాం..’’ అని హరీశ్ తెలిపారు. సమావేశంలో అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్‌తో భేటీ తమ్మిడిహట్టి, మేడిగడ్డతోపాటు పలు ఇతర ప్రాజెక్టులకు సహకరించాలని మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్‌కు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ ఎంపీలతో కలసి హన్స్‌రాజ్ అహిర్‌తో హరీశ్‌రావు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘సాగునీటి ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ విమర్శలు మాని తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తే మంచిది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిర్మించే నీటి ప్రాజెక్టుల గురించి ఇప్పటికే మహారాష్ట్ర సీఎం, మంత్రులతో చర్చించాం. సముద్రంలో వృథాగా కలిసే నీరు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది..’’ అని పేర్కొన్నారు. -
'రాత్రి 8 తర్వాత క్లాసులు వద్దు'
గుంటూరు: ర్యాంగింగ్ కారణంగా ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకోవడంతో మేలుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్డీవో భాస్కరనాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో పోలీసు, రెవెన్యూ, యూనివర్సిటీ అధికారులు సభ్యులుగా ఉన్నారు. శుక్రవారం సమావేశమైన ఈ కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కమిటీ నిర్ణయాలు * రాత్రి 8 తర్వాత యూనివర్సిటీలో ఎటువంటి క్లాసులు నిర్వహించకూడదు * క్యాంపస్ లో హైసెక్యురిటీ ఏర్పాటు చేయాలి * కుల సంఘాలు, రాజకీయ పార్టీల వారికి వర్సిటీలో అడుగుపెట్టనీయరాదు * వర్సిటీలో పోలీస్ ఔట్ పోస్ట్ నిర్వహించాలి * ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, అందులో విద్యార్థుల తల్లిదండ్రులకు చోటు కల్పించాలి -
‘విశ్వ’మంత లక్ష్యం
- బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్కు పచ్చజెండా - కౌన్సిల్‌కు రూ.50 కోట్ల వరకు మంజూరు అధికారం - స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో సమస్యలకు పరిష్కారం - స్వచ్ఛ హైదరాబాద్ సమన్వయ కమిటీ ప్రాథమిక నివేదిక - నేడు సీఎంతో సమావేశం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వ నగర స్థాయికి తీసుకు వెళ్లేందుకు... వివిధ సమస్యల పరిష్కారానికి... స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలని ప్రజాప్రతినిధులతో కూడిన సమన్వయ కమిటీ నిర్ణయించింది. నగరాన్ని స్లమ్ ఫ్రీ, చెత్త రహిత నగరంగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. ఈమేరకు రాజకీయాలకు అతీతంగా అన్నిపార్టీల వారు ఏకగ్రీవ తీర్మానం చేశారు. బీఆర్ఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లకు కమిటీ పచ్చజెండా ఊపింది. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డుల సమస్యలపై ఏర్పాటైన స్వచ్ఛ హైదరాబాద్ సమన్వయ కమిటీ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై... మూడు గంటలకుపైగా సుదీర్ఘంగా సమీక్షించింది. ప్రస్తుతానికి స్వల్ప కాలిక సమస్యల పరిష్కారానికి సూచనలు చేస్తూ... ప్రాథమిక ముసాయిదాను సిద్ధం చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమై... నివేదిక అందజేయనుంది. భవన నిర్మాణ అనుమతులు పారదర్శకంగా పొందేందుకు ఓ విధానాన్ని రూపొందించాలని కమిటీ అభిప్రాయపడింది. జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డుల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీచేయాలని సూచించింది. సమావేశం ముఖ్యాంశాలివీ... - నాలాల ఆక్రమణలు, బాటిల్‌నెక్స్ రోడ్ల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. నగరంలోని 74 నాలాల వెడల్పు, రక్షణ గోడల నిర్మాణాలకు డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేకంగా భూసేకరణ విభాగం ఏర్పాటు. - గోడలపై రాతలు, పోస్టర్ల నిషేధం క చ్చితంగా అమలు. ఫ్లెక్సీలు, హోర్డింగులకు జీహెచ్ఎంసీ అనుమతుల మేరకు నిర్ణీత వ్యవధికి మాత్రమే పరిమితం. అతిక్రమిస్తే పెనాల్టీలతో పాటు ఇతర చర్యలు. - డెబ్రిస్ తొలగింపు పనులను ఢిల్లీ తరహాలో ప్రైవేటు సంస్థకు అప్పగించాలని నిర్ణయం. ఇందుకుగాను సమన్వయ కమిటీ సభ్యులు ఢిల్లీలో పర్యటించాలి. - నగరంలో 60 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు అంచనా. ఈమేరకు బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్లను తిరిగి అమలు చేయాలని నిర్ణయం. భవిష్యత్తులో తిరిగి అక్రమ నిర్మాణాలకు తావులేకుండా చర్యలు. ఇందులో భాగంగా అక్రమ నిర్మాణాలకు విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలను కల్పించకపోవడంతో పాటు రిజిస్ట్రేషన్లకు వీల్లేకుండా చట్టాల్లో మార్పులు తేవాలని సూచన. - భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతకు సంస్కరణలు తేవాలని నిర్ణయం. దరఖాస్తు చేసిన 15 రోజుల్లో అనుమతులివ్వాలని, అందులో విఫలమైన అధికారులను బాధ్యులు చేయాలని నిర్ణయం. రెవెన్యూ మ్యాప్‌లను డిజిటలైజ్ చేయడంతో పాటు రెవెన్యూ, హెచ్ఎండీఏ, వాటర్ బోర్డుల మధ్య మరింత సమన్వయం అవసరం. - చెత్త సమస్య పరిష్కారానికి అవసరమైనన్ని అదనపు వాహనాల కొనుగోలు. చెత్త తరలింపు, ట్రీట్మెంట్కు తగిన విధానాలు అమలు చేయాలని తీర్మానం. రాంకీ ఒప్పందం తదితర అంశాల పరిష్కారానికి నిర్ణయం. చెత్తను తక్కువ ల్యాండ్‌ఫిల్ చేసి, ఎక్కువ విద్యుత్ ఉత్పత్తికి నిర్ణయం. - ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయం. - రోడ్డు కోతలకు తావులేకుండా కేబుల్స్ వంటివి ఏర్పాటుకు డక్టింగ్ పనులు. - రోడ్లపై నీటి నిల్వ సమస్యలు లేకుండా చూసేందుకు శాశ్వత చర్యలు. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. దీనికోసంప్రత్యేక బృందాల నియామకం. - కాంట్రాక్టుల విధానంలో మార్పులు అవసరమని అభిప్రాయ పడింది. ఒకరికే ఎక్కువ పనులు.. వేర్వేరు ప్రాంతాల్లో ఇవ్వకూడదు. కాంట్రాక్టర్ల స్థాయిని బట్టి చేయగల పనులు మాత్రమే ఇవ్వాలి. రూ.10 లక్షల లోపు పనులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, బస్తీ కమిటీలకు అప్పగించాలి. - నిధుల మంజూరులో జాప్యం నివారణ. ఇందులో భాగంగా కమిషనర్‌కు ఉన్న రూ.50 లక్షల మంజూరు అధికారాన్ని రూ.2 కోట్లకు... స్టాండింగ్ కమిటీ అధికారాన్ని రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచాలి. పాలకవర్గం అధికారాన్ని రూ.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచాలి. వీటికి అనుగుణంగా జోనల్ కమిషనర్లకు కూడా పెంచాలి. - పనులను రూ.2 కోట్లకు మించకుండా ప్యాకేజీలుగా విభజించాలి. తద్వారా నాణ్యతకు, మంచి కాంట్రాక్టర్లు రావడానికి అవకాశం ఉంటుందని కమిటీ అభిప్రాయం. - టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, పారిశుద్ధ్యం, వాటర్ బోర్డు తదితర విభాగాల్లోని ఖాళీలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలి. - ఎల్ఈడీ వీధి దీపాల ప్రాజెక్టు అమలుకు అంగీకారం. - నగరంలో ప్రస్తుతం 5 శాతం మాత్రమే ఉన్న గ్రీనరీ పెంపునకు చర్యలు - కొత్త చట్టం వల్ల రహదారుల వెడల్పు పనులకు నష్ట పరిహారంగా అధిక నిధులు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఫ్లోర్‌స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ), సెట్‌బ్యాక్ మినహాయింపుల వంటివి అమల్లోకి తేవాలని తీర్మానం. - జీహెచ్ఎంసీకి సంబంధించిన 20, వాటర్ బోర్డుకు చెందిన 16 అంశాలపై ఏకాభిప్రాయం. - ప్రస్తుతానికి ప్రాథమిక ముసాయిదాకు సిద్ధమైన సభ్యులు... దీర్ఘకాలంలో చేపట్టాల్సిన పనులతో సహా పూర్తి స్థాయి నివేదిక రూపొందించాలని నిర్ణయం. - సమావేశంలో మంత్రులు నాయిని, పద్మారావు, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ జాఫ్రి, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, డాక్టర్ లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. - ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కమిటీ నివేదికపై సమీక్ష సమావేశం జరుగనుంది. -
నేడు సాయంత్రం ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి హామీల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తీవ్రతరం చేయాలని శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ కానుంది. ఈ ఎజెండాతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ముగింపు పై కసరత్తు చేయాలని ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస సమన్వయ కమిటీ భేటీకి సంబంధించి ఇంకా వివరాలు తెలియ రావాల్సి ఉంది. -
తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం కమిటీ
హైదరాబాద్: కేంద్రం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. లేక్వ్యూలో చంద్రబాబుతో ఎంపిల సమావేశం ముగిసింది. ఈ కమిటీకి కో ఆర్డినేటర్‌గా ఎంపి సుజనా చౌదరిని నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా అశోక్ గజపతి రాజు, తోట నరసింహం, మల్లారెడ్డి, కంభంపాటి రామ్మోహనరావు, బీజేపి ఎంపిలు కంభంపాటి హరిబాబు, బండారు దత్తాత్రేయ ఉంటారు. విభజన బిల్లులోని అంశాల అమలుకు కృషి చేయాలని ఎంపిలను చంద్రబాబు కోరారు. తుపాను కారణంగా భారీ నష్టం జరిగినందున అధిక నిధులు రాబట్టడానికి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. సమావేశం ముగిసిన అనంతరం సుజనా చౌదరి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిపై చర్చించినట్లు తెలిపారు. విభజన సందర్భంగా ఏపికి ఇస్తామని చెప్పిన ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడినట్లు చెప్పారు. ఒక్కో ఎంపి తన నిధుల నుంచి కోటి రూపాయలను తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఖర్చు చేస్తారన్నారు. కమిటీ రాష్ట్రాలకు రావలసిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కృషి చేస్తుందని సుజనా చౌదరి చెప్పారు. ** -
‘పరిశీలన’ నిబంధనలకు విరుద్ధం
* బంగారం కుదువ పెట్టి అప్పుతీసుకున్న ఖాతాదారులు లేకుండానే.. * అభ్యంతరం చెబుతున్న బ్యాంకు మేనేజర్లు * రుణ మాఫీలో భాగం అంటున్న కోఆర్డినేషన్ కమిటీ మోర్తాడ్: పంట రుణాల మాఫీలో భాగంగా బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ నియమించిన ఆడిటర్లు వ్యవహరిస్తున్న తీరు నిబంధనలకు విరుద్ధంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పంట రుణాల మాఫీకి సంబంధించి వాణిజ్య, సహకార బ్యాంకులు జిల్లా స్థాయిలో కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. గుర్తింపు పొందిన చార్టెడ్ అకౌంటెంట్ల వద్ద శిక్షణ పొందుతున్న అకౌంటెంట్(కాలిబర్)లను ఆడిటర్లుగా కో ఆర్డినేషన్ కమిటీ నియమించింది. బ్యాంకులకు ఆడిటర్లు వెళ్లి పంట రుణం మాఫీకి అర్హులైన రైతులకు సంబంధించిన పహాణి, టైటిల్ డీడ్లను పరిశీలించాలి. అలాగే పంట రుణం పొందడానికి బంగారం కుదువ పెట్టినట్లు అయితే తనఖా ఉన్న బంగారాన్ని పరిశీలించాలి. టైటిల్ డీడ్, పహాణిల పరిశీలన సమయంలో ఖాతాదారులు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు. కుదువ ఉన్న బంగారాన్ని పరిశీలించే సమయంలో మాత్రం సంబంధిత ఖాతాదారు తప్పనిసరిగా ఉండాలి. బంగారాన్ని కుదువపెట్టే సమయంలో నగలు తయారు చేసే వృత్తిదారుడు పరిశీలించి బ్యాంకు అధికారులకు తన ఆమోదాన్ని తెలుపుతాడు. రుణం తీసుకునే ముందు ఖాతాదారు సమక్షంలోనే బంగారాన్ని ఒక పాలిథిన్ కవర్లో ఉంచి సీల్ చేస్తారు. రుణం చెల్లించి బంగారాన్ని ఖాతాదారు తీసుకునే సమయంలో ఖాతాదారు సమక్షంలోనే మళ్లి సీల్ విప్పి బంగారాన్ని ఖాతాదారుకు అందచేస్తారు. ఇప్పుడు ఆడిటింగ్ పేర ఆడిటర్లు బంగారం కుదువ పెట్టిన ఖాతాదారుడు లేక పోయినా సీల్ వేసిన కవర్లను విప్పి పరిశీలిస్తున్నారు. ఖాతాదారులకు సమాచారం ఇవ్వండి జిల్లాలోని ధర్పల్లి మండలం రామడుగు ఎస్బీఐ శాఖతో పాటు పలు గ్రామాలలో ఉన్న బ్యాంకుల శాఖలలోను బంగారు రుణాలకు సంబంధించి బ్యాంకులో కుదువపెట్టిన బంగారాన్ని ఆడిటర్లు పరిశీలించారు. పరిశీలన సమయంలో బంగారం కుదువపెట్టిన ఖాతాదారులు అందుబాటులో లేక పోయినా ఆడిటర్లు కవర్ల సీల్ విప్పి పరిశీలించారు. దీనిపై బ్యాంకు మేనేజర్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఉన్నతాధికారులు నోర్లు మూయించినట్లు తెలిసింది. కుదువ పెట్టిన బంగారాన్ని పరిశీలించడానికి మోర్తాడ్, జక్రాన్పల్లిలోని జిల్లా సహకార బ్యాంకు శాఖలకు ఆడిటర్లు రాగా ఖాతాదారులకు సమాచారం ఇచ్చిన తరువాతనే ఆడిటింగ్ చేయాలని మేనేజర్లు స్పష్టం చేశారు. దీంతో ఆడిటర్లు వెనుదిరిగి వెళ్లారు. ఖాతాదారులకు సంబంధించిన డాక్యుమెంట్లను మాత్రం ఎప్పుడైనా పరిశీలించవచ్చని, కుదువ పెట్టిన బంగారాన్ని మాత్రం ఖాతాదారు సమక్షంలో పరిశీలించాలని కొందరు మేనేజర్లు ఆడిటర్లకు సూచిస్తున్నారు. అయితే రుణ మాఫీ ప్రక్రియను తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ, ఆడిటర్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంగారం కుదువ పెట్టిన సంబంధిత వ్యక్తులు లేకుండా బంగారాన్ని పరిశీలిస్తే అందులో ఏదైనా పొరపాట్లు జరిగితే మేనేజర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఖాతాదారుల నమ్మకాన్ని కోల్పోతే బ్యాంకుల వ్యవస్థపైనే విశ్వాసం ఉండదని పలువురు మేనేజర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్యాంకుల కోఆర్డినేషన్ కమిటీ, ఉన్నతాధికారులు స్పందించి కుదువ పెట్టిన బంగారం పరిశీలన విషయంలో ఆడిటర్లు నిబంధనలు పాటించేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
ప్రధానితో ముగిసిన కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీ
-
అధిష్ఠానం డైరెక్షన్.. కిరణ్ యాక్షన్!
కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని మారుస్తారన్న వదంతుల నడుమ జరిగిన ఈ సమావేశం దాదాపు గంటా 40 నిమిషాలపాటు కొనసాగింది. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ నవ్వుకుంటూ బయటకు వచ్చారు. సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్‌పైనే చర్చ జరిగినట్లు సమాచారం. రెండు పీసీసీలు ఏర్పాటు చేస్తారన్న సమాచారం కూడా గుప్పుమంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తారన్న వార్తలు కూడా వినిపించాయి. దీంతో శ్రీధర్ బాబు హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం డైరెక్షన్లోనే సీఎం కిరణ్ సహా కాంగ్రెస్ నాయకులంతా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ విషయంలో వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేసిన అధిష్ఠానం, ఈనెల నాలుగోవారంలోనే బిల్లు అసెంబ్లీకి వస్తుందని, దాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత సీమాంధ్ర నాయకులదేనని దిగ్విజయ్ తదితర నేతలు చెప్పినట్లు సమాచారం. మొత్తం వ్యవహారంలో అధిష్ఠానం డైరెక్షన్లోనే సీఎం కిరణ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. దిగ్విజయ్ సింగ్ కూడా ఏ నిమిషంలోనూ కిరణ్ తీరును తప్పుబట్టలేదు. ఆయనకు అభ్యంతరాలున్నాయని, అయినా అధిష్ఠానాన్ని మాత్రం ధిక్కరించరని అన్నారు. ఇక అవసరమైతే రాయలసీమ నాయకులను ఎలాగోలా సంతృప్తిపరచి, రాయల తెలంగాణ ప్రతిపాదనను కూడా తెరపైకి తేవాలని అధిష్ఠానం పెద్దలు భావిస్తున్నారు. -
ఈ సాయంత్రం ఢీల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ సమన్వయ కమిటి సమావ