కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని మారుస్తారన్న వదంతుల నడుమ జరిగిన ఈ సమావేశం దాదాపు గంటా 40 నిమిషాలపాటు కొనసాగింది. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ నవ్వుకుంటూ బయటకు వచ్చారు.
సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్పైనే చర్చ జరిగినట్లు సమాచారం. రెండు పీసీసీలు ఏర్పాటు చేస్తారన్న సమాచారం కూడా గుప్పుమంది. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు అప్పగిస్తారన్న వార్తలు కూడా వినిపించాయి. దీంతో శ్రీధర్ బాబు హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు.
అయితే, కాంగ్రెస్ అధిష్ఠానం డైరెక్షన్లోనే సీఎం కిరణ్ సహా కాంగ్రెస్ నాయకులంతా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ విషయంలో వెనక్కి వెళ్లేది లేదని స్పష్టం చేసిన అధిష్ఠానం, ఈనెల నాలుగోవారంలోనే బిల్లు అసెంబ్లీకి వస్తుందని, దాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత సీమాంధ్ర నాయకులదేనని దిగ్విజయ్ తదితర నేతలు చెప్పినట్లు సమాచారం. మొత్తం వ్యవహారంలో అధిష్ఠానం డైరెక్షన్లోనే సీఎం కిరణ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. దిగ్విజయ్ సింగ్ కూడా ఏ నిమిషంలోనూ కిరణ్ తీరును తప్పుబట్టలేదు. ఆయనకు అభ్యంతరాలున్నాయని, అయినా అధిష్ఠానాన్ని మాత్రం ధిక్కరించరని అన్నారు. ఇక అవసరమైతే రాయలసీమ నాయకులను ఎలాగోలా సంతృప్తిపరచి, రాయల తెలంగాణ ప్రతిపాదనను కూడా తెరపైకి తేవాలని అధిష్ఠానం పెద్దలు భావిస్తున్నారు.
అధిష్ఠానం డైరెక్షన్.. కిరణ్ యాక్షన్!
Published Fri, Nov 8 2013 8:25 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement