యలమంచిలి అదనపు కో ఆర్డినేటర్‌గా బొడ్డేడ
పాయకరావుపేటకు నలుగురితో సమన్వయ కమిటీ
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ అదనపు కో ఆర్డినేటర్‌గా బొడ్డేడ ప్రసాద్‌ను నియమించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కో-ఆర్డినేటర్‌గా ప్రగడ నాగేశ్వరరావు వ్యవహరిస్తుండగా, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బొడ్డేడ ప్రసాద్‌ను అదనపు కో ఆర్డి నేటర్‌గా నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక నుంచి నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను ప్రసాద్ కూడా పర్యవేక్షిస్తారు. అలాగే పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి నలుగురితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.
మాజీ ఎమ్మెల్యేలు చెంగల వెంకట్రావు, గొల్ల బాబూరావులతో పాటు జెడ్పీలో పార్టీ ప్లోర్ లీడర్ చిక్కాల రామారావు, సీజీసీ సభ్యుడు వీసం రామకృష్ణలతో ఈ కమిటీని ఏర్పాటుచేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం సాయంత్రం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగే పార్టీ కార్యక్రమాలను ఇక నుంచి ఈ నలుగురి సభ్యులతో కూడిన కమిటీ పర్యవేక్షిస్తుంది.