13న ‘ఇండియా’ సమన్వయ కమిటీ తొలి భేటీ | 1st meet of INDIA bloc coordination committee in Delhi on 13 september 2023 | Sakshi
Sakshi News home page

13న ‘ఇండియా’ సమన్వయ కమిటీ తొలి భేటీ

Published Mon, Sep 11 2023 6:21 AM | Last Updated on Mon, Sep 11 2023 6:21 AM

1st meet of INDIA bloc coordination committee in Delhi on 13 september 2023 - Sakshi

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమన్వయ కమిటీ మొదటి సమావేశం ఈ నెల 13న ఢిల్లీలో జరుగనుంది. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసంలో ఈ భేటీ జరుగుతుందని కూటమి నేతలు ఆదివారం వెల్లడించారు. భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చిస్తామని తెలిపారు.

వివిధ పారీ్టలకు చెందిన 14 మంది నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇండియా కూటమిలో ఈ కమిటీ అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా పనిచేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement