హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్తో ఏపీ కాంగ్రెస్ నేతలు శనివారం ఉదయం 11 గంటలకు భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే ఆలోచనలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని మోడీ, కేంద్రమంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబులపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టిన విషయం విదితమే. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్కు కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇవ్వనున్నారు.