పెరూలో భారీ భూకంపం
లీమా: దక్షిణ అమెరికా ఖండంలోని పెరూలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:45 గంటల నుంచి దాదాపు అరగంటపాటు భూమి కంపించింది. భూ ఉపరితలానికి 602 కిటోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదయింది. ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కాగా, పెరూ భూకంపంతో లాటిన్ అమెరికా దేశాలన్నీ చిగురుటాకుల్లా వణికిపోయాయు. బ్రిజిల్, బొలీవియా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్, అర్జెంటీనాల్లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. అయితే భూకంప కేంద్రం భూతలానికి చాలా లోతులో ఉండటం వల్ల నష్టతీవ్రత అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు.