లిమా: పెరూ రాజధాని లిమాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.6గా నమోదు అయింది. లిమాకు 45 కిలోమీటర్లు దూరంలో సముద్రంలో ఈ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే శనివారం వెల్లడించింది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కాని సంభవించలేదని తెలిపింది. ఈ భూకంపం శుక్రవారం రాత్రి వచ్చిందని పేర్కొంది.