
లీమా : ప్రేమ పరవశంలో మునిగిన ఓ జంట ప్రమాదవశాత్తూ ప్రాణాలు విడిచింది. ముద్దుల్లో మునిగి ప్రపంచాన్ని మరిచిన పెరు దేశానికి చెందిన భార్యాభర్తలు ఎస్పినోజ్ (34), హెక్టర్ విడాల్ (36) ఊహించని విధంగా విగత జీవులయ్యారు. ఈ హృదయ విదారక ఘటన బెత్లెహాం బ్రిడ్జిపైన గత శనివారం చోటుచేసుకుంది. పర్వతారోహకులైన వీరిద్దరూ టూరిస్టు గైడ్‌లుగా పనిచేసేందుకు క్యూసో పట్టణానికి వచ్చారు. పనిముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో రాత్రి ఒంటిగంట ప్రాంతంలో బెత్లెహాం బ్రిడ్జిపై కాసేపు ఆగారు.
ఇద్దరూ తన్మయత్వంతో ముద్దుల్లో మునిగారు. ఆ సమయంలో ఎస్పినోజ్ తన భర్త విడాల్‌ను దగ్గరగా లాక్కునేందుకు యత్నించింది. అయితే, ఉన్నట్టుండి బ్యాలెన్స్ తప్పడంతో ఇద్దరూ రక్షణ గోడపై నుంచి 50 మీటర్ల దిగువన రోడ్డుపై పడిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఎస్పినోజ్ మార్గమధ్యంలో చనిపోగా, విడాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment