లోయలో పడిన బస్సు :15 మంది మృతి
లిమా : బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడి 15 మంది మృతి చెందగా... మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన మధ్య పెరూ ప్రాంతంలో చోటు చేసుకుందని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. క్షతగాత్రులను హురజ్లోని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులు వెల్లడించారని చెప్పారు.
దాంతో పెరూ రాజధాని లిమాలోని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని... ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనేది ఇంకా స్పష్టంగా తెలియలేదన్నారు. బస్సు లిమా నుంచి లాటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.