ఘోర ప్రమాదం : 23 మంది మృతి | Peru crash kills 23 after bus plunges into river in Andes Mountains | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం : 23 మంది మృతి

Published Sat, Apr 9 2016 5:41 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

ఘోర ప్రమాదం : 23 మంది మృతి

ఘోర ప్రమాదం : 23 మంది మృతి

లిమా: పెరూ ఆగ్నేయ ప్రాంతంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అండీస్ పర్వత ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మపాచో నదిలో పడింది. ఈ ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కుస్కో నగరంతోపాటు సమీప పట్టణంలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. 

ప్రమాదం జరిగిన ప్రాంతంలో బ్రిడ్జ్ పనులు జరగుతుందని...ఈ నేపథ్యంలో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిందన్నారు. ఆదివారం పెరూలో దేశాధ్యక్షడు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్యూర్టో మల్డోనాడో నగరం నుంచి కుస్కో నగరానికి ప్రయాణికులు వస్తున్న తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement