
టన్నుల కొద్దీ కొకైన్ స్వాధీనం!
మత్తు పదార్థాలు గ్రాముల్లో పట్టుబడితేనే పెద్ద వార్త అనుకుంటాం. అలాంటిది కిలోలు కాదు, క్వింటాళ్లు కాదు, టన్నుల కొద్దీ పట్టుబడితే డ్రగ్స్ ఏ స్థాయిలో సరఫరా అవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. లాటిన్ అమెరికాలోని పెరూలో ఏకంగా 3.3 టన్నుల కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు.
దక్షిణ అమెరికా నుంచి యూరప్‌లోని బెల్జియం, స్పెయిన్‌లకు సరఫరా చేయడానికి సిద్ధం చేసిన షిప్‌మెంట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ముఠాను పట్టుకోవడానికి పెరూ పోలీసులు అమెరికా సహకారం తీసుకున్నారు. ఇద్దరు మెక్సికన్లను, ఐదుగురు పెరూవియన్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కొకైన్ సరఫరా వెనుక మెక్సికన్ డ్రగ్ ముఠాలు ఉండవచ్చుని పెరూ పోలీసులు అనుమానిస్తున్నారు.