గ్రహాంతరవాసులు మనం ఉంటున్న భూమి మీద లేదా విశ్వంలోని మరే ఇతర గ్రహం మీదనైనా నివసిస్తున్నారా? ఈ ప్రశ్నకు ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్త కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి గురించి వేల సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. భూమిపై గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి శాస్త్రవేత్తల వాదనలు రెండు రకాలుగా ఉన్నాయి. గ్రహాంతర వాసులు విశ్వంలో ఎక్కడో ఉన్నారని, ఏదో ఒక రోజు తప్పకుండా మన ముందుకు వస్తారని ఒక వర్గం చెబుతుండగా, మరోవర్గం ఈ వాదనను పూర్తిగా ఖండిస్తోంది.
పెరూలో 7 అడుగుల వింతజీవులు
తాజాగా పెరూ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఆల్టో నానే జిల్లాలో ఇలాంటి ఉదంతం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహాంతరవాసుల పొడవు 7 అడుగులు ఉంది. వాటి కళ్లు పసుపు రంగులో ఉన్నాయి. చూపరులకు ఆ వింత జీవులు భయం గొలుపుతున్నాయి. ఆ వింతజీవిని చూసిన ఓ బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆమెను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు.
ఎదుటివారి ముఖంపై ‘ఏలియన్స్’ దాడి
పెరూలోని ఆల్టో నానే జిల్లా నివాసి ఇక్విటు మాట్లాడుతూ గత కొంతకాలంగా నల్లటి హూడీలు ధరించిన ఈ ‘ఏలియన్లు’ జనాలపై దాడిచేస్తున్నాయని చెప్పారు. అలాగే ఇక్కడి గిరిజన ప్రాంతంలో నివసించే ఇకూటి జాతి ప్రజలు కూడా అకస్మాత్తుగా జనాల మధ్యలోకి వచ్చి, దాడి చేసి పారిపోతున్నారని తెలిపారు. వారు ఎదుటివారి ముఖానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారని, ఇది ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నదని తెలిపారు.
15 ఏళ్ల బాలికపై దాడి
నెల రోజుల క్రితం ఆల్టో నానే జిల్లాలో తొలిసారిగా ఏలియన్స్‌గా చెబుతున్న వింత జాతి జీవులు కనిపించాయని అంటున్నారు. వారి దాడుల కారణంగా 15 ఏళ్ల బాలిక గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఈ అమ్మాయి గ్రహాంతరవాసులను చూసి భయపడిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
‘వింత జీవుల నుంచి ప్రజలను కాపాడుతున్నాం’
మరోవైపు ఈ జీవులు గ్రహాంతరవాసులా లేదా మరొకరా అనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరికొందరు హుడీ ధరించిన ఇలాంటి జీవిని తమ జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేదని అంటున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే ఆ వింతజీవులు చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాయి. ఆల్టో నానే జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు జైరో రెటెగుయ్ దవిలా మాట్లాడుతూ గ్రహాంతరవాసులుగా కనిపించినవారు ఆ బాలిక మెడపై గాయం చేశారన్నారు.
దీంతో రాత్రిపూట తాము కాపలాకాస్తూ, స్థానికులను రక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ వింతజీవులు రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుండటంతో, వారి రూపాన్ని సరిగా గుర్తించలేకపోతున్నామన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు తెగబడుతున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి: Pakistan Richest Man: కేవలం 500 డాలర్లతో అమెరికా చేరుకుని..
Comments
Please login to add a commentAdd a comment