![Earthquake Measuring 4 5 on Richter Scale hits Nepal - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/23/nepal.jpg.webp?itok=PL2tS26p)
భారత్ పొరుగు దేశమైన నేపాల్‌లో ఈ రోజు (గురువారం) తెల్లవారుజామున భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు లోనయ్యారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.5గా నమోదయ్యిందని, భూకంప కేంద్రం మక్వాన్‌పూర్ జిల్లాలోని చిట్లాంగ్‌లో ఉందని నేపాల్ సైన్స్ సెంటర్ తెలిపింది.
ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. కాగా నవంబర్ 3న, నేపాల్‌లోని జాజర్‌కోట్‌లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. 153 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా ఇప్పటికీ గుడారాలలో నివసిస్తున్న దుస్థితి నెలకొంది. చలికి వీరంతా అల్లాడుతున్నారు. విపరీతమైన చలి కారణంగా ఐదుగురు మృతిచెందారు.
కాగా నవంబర్ 17న మయన్మార్‌లో భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం 5.7 తీవ్రతతో ఈ భూకంపం వచ్చింది. షాన్ రాష్ట్రంలోని కెంగ్ టంగ్ నగరానికి నైరుతి దిశలో భూకంపం కేంద్రీకృతమయ్యింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.
ఇది కూడా చదవండి: వందేభారత్ స్నాక్ ట్రేలు ధ్వంసం చేస్తున్న పిల్లలు?
Comments
Please login to add a commentAdd a comment