Alien attack
-
వింతజీవుల అకస్మాత్తు దాడులు.. గ్రహాంతరవాసులే అంటున్న జనం!
గ్రహాంతరవాసులు మనం ఉంటున్న భూమి మీద లేదా విశ్వంలోని మరే ఇతర గ్రహం మీదనైనా నివసిస్తున్నారా? ఈ ప్రశ్నకు ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్త కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి గురించి వేల సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. భూమిపై గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి శాస్త్రవేత్తల వాదనలు రెండు రకాలుగా ఉన్నాయి. గ్రహాంతర వాసులు విశ్వంలో ఎక్కడో ఉన్నారని, ఏదో ఒక రోజు తప్పకుండా మన ముందుకు వస్తారని ఒక వర్గం చెబుతుండగా, మరోవర్గం ఈ వాదనను పూర్తిగా ఖండిస్తోంది. పెరూలో 7 అడుగుల వింతజీవులు తాజాగా పెరూ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఆల్టో నానే జిల్లాలో ఇలాంటి ఉదంతం తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ గ్రహాంతరవాసుల పొడవు 7 అడుగులు ఉంది. వాటి కళ్లు పసుపు రంగులో ఉన్నాయి. చూపరులకు ఆ వింత జీవులు భయం గొలుపుతున్నాయి. ఆ వింతజీవిని చూసిన ఓ బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆమెను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. ఎదుటివారి ముఖంపై ‘ఏలియన్స్’ దాడి పెరూలోని ఆల్టో నానే జిల్లా నివాసి ఇక్విటు మాట్లాడుతూ గత కొంతకాలంగా నల్లటి హూడీలు ధరించిన ఈ ‘ఏలియన్లు’ జనాలపై దాడిచేస్తున్నాయని చెప్పారు. అలాగే ఇక్కడి గిరిజన ప్రాంతంలో నివసించే ఇకూటి జాతి ప్రజలు కూడా అకస్మాత్తుగా జనాల మధ్యలోకి వచ్చి, దాడి చేసి పారిపోతున్నారని తెలిపారు. వారు ఎదుటివారి ముఖానికి హాని కలిగించడానికి ప్రయత్నిస్తారని, ఇది ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నదని తెలిపారు. 15 ఏళ్ల బాలికపై దాడి నెల రోజుల క్రితం ఆల్టో నానే జిల్లాలో తొలిసారిగా ఏలియన్స్‌గా చెబుతున్న వింత జాతి జీవులు కనిపించాయని అంటున్నారు. వారి దాడుల కారణంగా 15 ఏళ్ల బాలిక గాయాలతో ఆసుపత్రిలో చేరింది. ఈ అమ్మాయి గ్రహాంతరవాసులను చూసి భయపడిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ‘వింత జీవుల నుంచి ప్రజలను కాపాడుతున్నాం’ మరోవైపు ఈ జీవులు గ్రహాంతరవాసులా లేదా మరొకరా అనే విషయాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మరికొందరు హుడీ ధరించిన ఇలాంటి జీవిని తమ జీవితంలో ఎప్పుడూ కూడా చూడలేదని అంటున్నారు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే ఆ వింతజీవులు చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాయి. ఆల్టో నానే జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు జైరో రెటెగుయ్ దవిలా మాట్లాడుతూ గ్రహాంతరవాసులుగా కనిపించినవారు ఆ బాలిక మెడపై గాయం చేశారన్నారు. దీంతో రాత్రిపూట తాము కాపలాకాస్తూ, స్థానికులను రక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ వింతజీవులు రాత్రిపూట మాత్రమే బయటకు వస్తుండటంతో, వారి రూపాన్ని సరిగా గుర్తించలేకపోతున్నామన్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు తెగబడుతున్నారని అన్నారు. ఇది కూడా చదవండి: Pakistan Richest Man: కేవలం 500 డాలర్లతో అమెరికా చేరుకుని.. -
ఏలియన్స్ దాడి.. పోరాడేందుకు తొమ్మిదేళ్ల బాలుడు!
వాషింగ్టన్: ఒకవేళ గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేస్తే వారి నుంచి భూగోళాన్ని రక్షించేందుకు ఏం చేయాలి అని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఆలోచించింది. ఇందుకోసం ప్లానెటరీ ప్రొటెక్షన్ అధికారిని కోసం అప్లికేషన్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే నాసా వారికి షాకిస్తూ న్యూజెర్సీకి చెందిన తొమ్మిదేళ్ల బాలుడు ఆ ఉద్యోగానికి తాను సరిపోతానంటూ దరఖాస్తు పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని నాసా స్వయంగా వెల్లడించింది. వివరాల్లోకెళ్తే.. న్యూజెర్సీకి చెందిన జాక్ డెవిస్ వయసు తొమ్మిదేళ్లు. కాగా, డేవిస్‌ను తన అక్క ఎప్పుడూ ఏలియన్ (గ్రహాంతరవాసి) అంటూ ఆటపట్టించేంది. ఎందుకంటే డేవిస్ ఎక్కువగా ఏలియన్లకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతో పాటు ఏలియన్లపై తీసిన మూవీలు చేసేవాడు. ఈ విషయాలను వివరిస్తూ.. అందుకే తాను ప్లానెటరీ ప్రొటెక్షన్ అధికారిగా పని చేయాలనుకుంటున్నట్లు తన దరఖాస్తులో పేర్కొన్నాడు. భూగోళాన్ని కాపాడేందుకు తాను సరైన వాడినని నమ్ముతున్నట్లు చెప్పిన మాటలు నాసా వారిని మెప్పించాయి. నాసా ప్లానెటరీ సైన్స్ డైరెక్టర్ జిమ్ గ్రీన్ న్యూజెర్సీ బాలుడు డేవిస్‌కు ఓ లేఖతో బదులిచ్చారు. ‘ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్ జాబ్ చాలా కష్టతరమైంది. భూమిపైకి దూసుకొచ్చే గ్రహ శకలాలు, ఇతర జీవాల గురించి తీవ్రంగా శోధించాల్సి ఉంటుంది. మేం నాణ్యమైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల కోసం అన్వేషిస్తుంటాం. నువ్వు బాగా చదువుకుని ఏదో ఒక రోజు నాసాకు ఎంపిక కావాలని ఆశిస్తున్నానంటూ’ డేవిస్‌లో ఉత్సాహాన్ని నింపారు. మరోవైపు నాసా ప్లానెటరీ రీసెర్చ్ డైరెక్టర్ జోనాథన్ రాల్ స్వయంగా బాలుడు డేవిస్‌కు కాల్ చేసి అభినందించారు. ఇంత చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచించావంటూ ప్రశంసించారు. అమెరికా జాతీయులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ నెల 14లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏటా రూ. 79.13 లక్షల నుంచి రూ. 1.18 కోట్ల జీతం. అంతరిక్షంలో ప్రయాణిస్తున్న సమయంలో వ్యోమగాములు, రోబోలు ఆర్గానిక్, బయోలాజికల్ పదార్థాలచేత ప్రభావితం కాకుండా చూడటం ఈ అధికారి ప్రధాన బాధ్యత. -
ఎలియన్స్ దాడి.. కాపాడేందుకు మీరు రెడీనా?
ప్లానెటరీ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం కోసం నాసా ప్రకటన ఒకవేళ గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేస్తే ఏమిటి పరిస్థితి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మాత్రం ఇప్పుడు అదే పని చేస్తోంది. ఎలియన్స్ దాడుల నుంచి, ప్రభావం నుంచి భూగోళాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా ప్లానెటరీ ప్రొటెక్షన్ అధికారిని నియమించుకోబోతున్నది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ జాబ్స్ వెబ్సైట్లో ఒక ఉద్యోగ ప్రకటనను వెలువరించింది. అమెరికా జాతీయులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ నెల 14లోగా ఈ ఉద్యోగం దరఖాస్తు చేసుకోవాలని నాసా సూచించింది. ఈ ఉద్యోగం కోసం ఏటా రూ. 79.13 లక్షల నుంచి రూ. 1.18 కోట్ల ($124,406 నుంచి $187,000) జీతంతోపాటు అదనపు లబ్ధులను చేకూర్చనున్నట్టు తెలిపింది. అంతరిక్షంలో ప్రయాణిస్తున్న సమయంలో వ్యోమగాములు, రోబోలు ఆర్గానిక్, బయోలాజికల్ పదార్థాలచేత ప్రభావితం కాకుండా చూడటం ఈ అధికారి ప్రధాన బాధ్యత. నాసా చేపట్టే ప్లానెటరీ ప్రొటెక్షన్ మిషన్ అనుబంధ కార్యక్రమాలను ప్రణాళిక, సమన్వయంలో పాలుపంచుకోవడం, ఇందుకు సంబంధించి మానవ సహిత, రోబోటిక్ వ్యోమనౌకల ప్రయాణాలకు సంబంధించి సలహాలు, సమాచారం అందించడం విధులను నిర్వహించాల్సి ఉంటుంది. మూడేళ్ల వరకు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగం ఉంటుందని, మెరుగైన సేవలు అందిస్తే కాంట్రాక్ట్‌ను మరో రెండేళ్లు పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. ఈ కాలంలో నాసా పలు మిషన్లను చేపట్టబోతున్నది. జూపిటర్ ఐసీ మూన్‌గా పేరొందిన యూరోప గ్రహం అన్వేషణతోపాటు, వివిధ గ్రహాల్లో జీవం మనుగడపై పరిశోధించబోతున్నది.