ఎలియన్స్ దాడి.. కాపాడేందుకు మీరు రెడీనా? | NASA to hire planetary protection officer to save Earth | Sakshi
Sakshi News home page

ఎలియన్స్ దాడి.. కాపాడేందుకు మీరు రెడీనా?

Published Thu, Aug 3 2017 10:08 AM | Last Updated on Sun, Sep 17 2017 5:07 PM

ఎలియన్స్ దాడి.. కాపాడేందుకు మీరు రెడీనా?

ఎలియన్స్ దాడి.. కాపాడేందుకు మీరు రెడీనా?

  • ప్లానెటరీ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఉద్యోగం కోసం నాసా ప్రకటన


  • ఒకవేళ గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేస్తే ఏమిటి పరిస్థితి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మాత్రం ఇప్పుడు అదే పని చేస్తోంది. ఎలియన్స్ దాడుల నుంచి, ప్రభావం నుంచి భూగోళాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా ప్లానెటరీ ప్రొటెక్షన్‌ అధికారిని నియమించుకోబోతున్నది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వ జాబ్స్‌ వెబ్‌సైట్‌లో ఒక ఉద్యోగ ప్రకటనను వెలువరించింది. అమెరికా జాతీయులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ నెల 14లోగా ఈ ఉద్యోగం దరఖాస్తు చేసుకోవాలని నాసా సూచించింది. ఈ ఉద్యోగం కోసం ఏటా రూ. 79.13 లక్షల నుంచి రూ. 1.18 కోట్ల ($124,406 నుంచి $187,000) జీతంతోపాటు అదనపు లబ్ధులను చేకూర్చనున్నట్టు తెలిపింది. అంతరిక్షంలో ప్రయాణిస్తున్న సమయంలో వ్యోమగాములు, రోబోలు ఆర్గానిక్‌, బయోలాజికల్‌ పదార్థాలచేత ప్రభావితం కాకుండా చూడటం ఈ అధికారి ప్రధాన బాధ్యత.

    నాసా చేపట్టే ప్లానెటరీ ప్రొటెక్షన్‌ మిషన్‌ అనుబంధ కార్యక్రమాలను ప్రణాళిక, సమన్వయంలో పాలుపంచుకోవడం, ఇందుకు సంబంధించి మానవ సహిత, రోబోటిక్‌ వ్యోమనౌకల ప్రయాణాలకు సంబంధించి సలహాలు, సమాచారం అందించడం విధులను నిర్వహించాల్సి ఉంటుంది. మూడేళ్ల వరకు ఈ కాంట్రాక్ట్‌ ఉద్యోగం ఉంటుందని, మెరుగైన సేవలు అందిస్తే కాంట్రాక్ట్‌ను మరో రెండేళ్లు పొడిగించే అవకాశముందని తెలుస్తోంది. ఈ కాలంలో నాసా పలు మిషన్లను చేపట్టబోతున్నది. జూపిటర్‌ ఐసీ మూన్‌గా పేరొందిన యూరోప గ్రహం అన్వేషణతోపాటు, వివిధ గ్రహాల్లో జీవం మనుగడపై పరిశోధించబోతున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement