
ప్రతీకాత్మక చిత్రం
మనీలా: దక్షిణ ఫిలిఫ్పైన్స్ ఒక్సిడెంటల్ మిన్‌డోరో ప్రావిన్స్‌లోని సబ్లాయన్ పట్టణ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 9.30 గంటలకు జరిగిందిని విపత్తు నిర్వహణాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను దగ్గరలోని మూడు ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment