ఘోర బస్సు ప్రమాదం, 18 మంది మృతి | At least 18 people died and 33 were injured in bus crash | Sakshi
Sakshi News home page

ఘోర బస్సు ప్రమాదం, 18 మంది మృతి

Published Mon, Mar 6 2017 9:21 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

రోడ్డు ప్రమాదం ఫైల్‌ ఫోటో

రోడ్డు ప్రమాదం ఫైల్‌ ఫోటో

పనామా సిటీ: ఉత్తర అమెరికా దేశం పనామాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజధాని పనామా సిటీకి నైరుతి దిశగా 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంటన్‌లో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది.

బస్సులో 50 మందికి పైగా కూలీలను తీసుకెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద స్థలంలోనే 16 మంది మరణించగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో మృతి చెందారని సివిల్‌ డిఫెన్స్ డైరెక్టర్‌ జోస్‌ డొండెరిస్‌ తెలిపారు. క్షతగాత్రులను హెలికాప్టర్‌ల సహాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతుఉన్నామని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement