
అటవీ ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తూ పనుల గురించి ఆరా తీస్తున్న మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్: ఉదయం ఆరు గంటల సమయం.. ఇంకా చీకటి తెరలు తొలగిపోలేదు.. అంతలో మూడు వాహనాలు రాజీవ్ రహదారి పక్కన ఉన్న చెట్ల మధ్యకు దూసుకెళ్లాయి. వాహనంలో నుంచి దిగిన నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అక్కడి నుంచి 2 గంటల పాటు 5 కిలోమీటర్ల మేర కాలినడకన ముందుకు సాగారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట పట్టణం నాగులబండ శివారులో ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్‌ను పరిశీలించారు. నిధుల అవసరం, మొక్కల పెంపకంపై ఆయన వెంట వెంటనున్న డీఎఫ్‌వో శ్రీధర్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఆక్సిజన్ పార్క్, అర్బన్ పార్క్ పనులపై ఆరా తీశారు.
Comments
Please login to add a commentAdd a comment