
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. మార్నింగ్ వాక్‌కు వెళ్తొస్తున్న వివాహితపై ఓ కామాందుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన న్యూ లింక్ రోడ్డులో గల కాందీవళి ప్రాంతంలో జరిగింది. వివరాలు.. రోజూ మాదిరిగానే మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ మహిళ (33) మలద్ ప్రాంతానికి చేరుకోగానే రామ్‌రాజ్ పవార్ (33) అనే వ్యక్తి ఆమెను ఫాలో అయ్యాడు.
కొంత దూరం వరకు ఆమెను వెనకాలే స్కూటర్‌పై వెంబడించాడు. అనంతరం స్కూటర్‌ను పక్కన పడేసి.. ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. దీంతో ఆమె సాయం కోసం గట్టిగా కేకలు వేసింది. వెంటనే స్పందించిన స్థానికులు నిందితున్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఘటన జరిగినప్పుడు రామ్‌రాజ్ మత్తులో తూలుతున్నాడనీ, కేసు నమోదు చేసి నిందితున్ని జూడిషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment