కోదాడ(సూర్యాపేట): మార్నింగ్ వాక్ చేయడానికి వెళ్తున్న రిటైర్డ్ మహిళా ఉద్యోగి ప్రమాదవశాత్తూ మృతిచెంచారు. రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రాణాలు విడిచారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న జాముల రాణి(60) ఉపాధ్యాయురాలిగా చేశారు.
ఇటీవలే పదవీ విరమణ పొందారు. ఈ రోజు ఉదయం వాకింగ్ చేయడానికి గ్రౌండ్‌కు వెళ్తుండగా.. 65వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రిటైర్డ్ టీచర్ మార్నింగ్ వాక్‌కు వెళ్తుండగా..
Published Fri, Apr 7 2017 8:33 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
Advertisement
Advertisement