మార్నింగ్ వాక్‌లో... తరుముకొచ్చిన మృత్యువు | man dies in road accident | Sakshi
Sakshi News home page

మార్నింగ్ వాక్‌లో... తరుముకొచ్చిన మృత్యువు

Published Thu, Apr 21 2016 11:32 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

man dies in road accident

 రోజూలాగే వారిద్దరు కలిసి మార్నింగ్ వాక్‌కు వెళ్లారు. ప్రశాంతమైన వాతావరణంలో హాయిగా మాట్లాడుకుంటూ ముందుకెళ్తున్న వారు వెనుక నుంచి మృత్యువు తరుముకొస్తుందన్న విషయం గమనించలేదు. నడుచుకుంటూ వెళ్తున్న వారిని వేగంగా దూసుకొచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఒకరు సమీప పొలాల్లో ఎగిరిపడగా...మరొకరు ట్రాక్టర్ ముందు చక్రాల కింద నలిగిపోయూరు. వాక్‌కు వెళ్లిన వారు ఇంటికి ఇంకా రాలేదమన్న ఆందోళనతో ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు పిడుగు లాంటి వార్త చేరింది. కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు.
 
 సంతకవిటి: మార్నింగ్ వాక్‌లో వారి వెంట మృత్యువు ట్రాక్టర్ రూపంలో తరుముకొచ్చింది. కళ్లు మూసి తెరిచేలోగా వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ వారిని ఢీకొంది. ఈ ఘటనలో ఉపాధ్యాయుడొకరు మృత్యువాత పడగా...మరొకరు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. మండలంలోని చినమిర్తివలస-మల్లయ్యపేట గ్రామాల మధ్య గురువారం జరిగిన సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాలు... మంతిన గ్రామానికి చెందిన కాయల ఉపాధ్యాయుడు వెంకటరమణ(38), నల్లబారికి లక్ష్మణరావు గురువారం ఉదయం రోజూలాగే మార్నింగ్ వాక్‌కు ఇంటి నుంచి బయలుదేరారు.
 
 చిన్నమిర్తివలస ఆర్‌అండ్‌బీ బీటీ రహదారి మీదుగా మల్లయ్యపేట వైపు నడుస్తూ వెళ్తుండగా పొందూరు నుంచి సంతకవిటి వైపు చిప్స్‌తో వస్తున్న ట్రాక్టర్ వెనుక నుంచి అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో లక్ష్మణరావు రోడ్డు పక్కనే ఉన్న పొలంలో పడిపోగా కాలు విరిగి, నడుముకు బలమైన గాయూలయ్యూయి. లక్ష్మణరావు కేకలకు వెనక్కి తిరిగి చూసేలోగా ఉపాధ్యాయుడు వెంకటరమణపైకి కూడా ట్రాక్టర్ దూసుకొచ్చింది. వెంకటరమణ ట్రాక్టర్ ముందు చక్రాల కింద పడి నలిగిపోయూడు. ఆయన ఛాతి మీదుగా చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
 
 అదే సమయంలో పంట పొలాల్లో పనుల నిమిత్తం వచ్చిన మల్లయ్యపేటకు చెందిన రైతులు సంఘటనా స్థలానికి చేరుకొని 108 వాహనానికి, బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. ఇంతలోనే వెంకటరమణ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణరావును ప్రాథమిక చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మృతి చెందిన వెంకటరమణ లావేరు మండలం కె.కుంకాం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. ఈయన భార్య లక్ష్మి కూడా ఇదే మండలంలో సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వ్యాయూమ ఉపాధ్యారుునిగా పని చేస్తున్నారు.
 
 కుటుంబ సభ్యుల్లో విషాదం
 వెంకటరమణ మృతితో ఆ ఇంట విషాదం అలుముకొంది. తండ్రి దాలయ్య తన కొడుక్కి ఏం జరిగిందో తెలియక భోరున విలపిస్తున్నాడు. వెంకటరమణకు మూడున్నరేళ్ల పురుషోత్తంతో పాటు రెండేళ్ల ప్రసన్న ఉంది. వీరికి తల్లి ఎందుకు ఏడుస్తుందో, నాన్నకు ఏమైందో తెలియక బిత్తర చూపులు చూస్తున్నారు. ఈ సంఘటన చూపరులను కంటతడి పెట్టించింది.
 
 కేసు నమోదు...
 ప్రమాద విషయం తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ ఎస్.తాతారావు బాధిత కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షులు వద్ద వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి వెంకటరమణ మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు.  ప్రమాదానికి కారణమైన ట్రాక్టరును సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పాటు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement