మార్నింగ్ వాక్‌కు వెళ్లిన యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
మీరట్: మార్నింగ్ వాక్‌కు వెళ్లిన యువతిపై ఐదుగురు కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మీరట్‌లోని మలియానా ప్రాంతంలో ఉండే 26 ఏళ్ల యువతి శనివారం ఉదయం చెల్లెలితో కలసి మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఐదుగురు యువకులు యువతితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.
దీంతో యువతి సోదరి అక్కడి నుంచి పరుగున ఇంటికి వెళ్లి.. జరిగిన విషయం చెప్పి కొంతమందిని తీసుకువచ్చింది. అయితే వారు ఘటనా స్థలానికి వచ్చేసరికి యువతి సమీపంలోని పొలాల్లో అపస్మారక స్థితిలో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి యాశ్‌పాల్, రాజ్‌పాల్, రాజేంద్రతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.