VIRAL VIDEO: ‘వేర్ ఏ మాస్క్-సేవ్ ఏ లైఫ్’.. కరోనా టైం మొదలైనప్పటి నుంచి వినిపిస్తున్న నినాదం ఇది. దశల వారీగా, వేరియెంట్లతో మానవాళిపై వైరస్ విరుచుకుపడుతున్నా.. మాస్క్‌లు వీడొద్దంటూ వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు. కరోనా వచ్చి తగ్గినా.. వ్యాక్సినేషన్ నడుస్తున్నా.. పూర్తిస్థాయి రక్షణ కోసం మాస్క్.. వీలైతే డబుల్ మాస్కులు ధరించాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే ఆంక్షల సడలింపుతో చాలామంది ముఖానికి మాస్క్‌లు ధరించడం లేదు. ధరించినా కొందరు అసంపూర్తిగా పెట్టుకుంటున్నారు. రద్దీ మార్కెట్లు, ప్రయాణాల్లో, ఆఫీసుల్లో.. చాలామందిలో ఈ నిర్లక్క్ష్యం పెరిగిపోయింది. అడిగితే దురుసు-నిర్లక్క్ష్యపు సమాధానాలు వినిపిస్తున్నాయి. పైగా థర్డ్ వేవ్ ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నా.. చాలామందిలో ఈ ధోరణి మారడం లేదు. ఈ తరుణంలో ఓ పాత వీడియోను తెరపైకి తెచ్చారు కొందరు. పైగా సందర్భానికి తగ్గ వీడియో కావడంతో చాలామంది వాట్సాప్ స్టేటస్‌ల ద్వారా మళ్లీ వైరల్ చేస్తున్నారు.
వైకల్యం ఉన్నా తమనే మాస్క్ ధరించడం నుంచి మినహాయింపు ఇవ్వకండని, తామే మాస్క్‌లు ధరించినప్పుడు అన్నీ సక్రమంగా ఉన్నవాళ్లూ ధరించడం తప్పనిసరని గుర్తు చేసే ఆ వీడియో కిందటి ఏడాది ఫస్ట్ వేవ్ తర్వాత బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియోను మేరీల్యాండ్ యూనివర్సిటీ డాక్టర్ ఫహీమ్ యూనస్ ట్విటర్ అకౌంట్ నుంచి కిందటి ఏడాది సెప్టెంబర్ 16న పోస్ట్ అయ్యింది. కావాలంటే మరోసారి మీరూ చూసేయండి. బాధ్యతను గుర్తు చేసుకుని దయచేసి సక్రమంగా మాస్క్‌లు ధరించండి.
Comments
Please login to add a commentAdd a comment