కాన్పూర్ : మాస్క్ ధరించలేదన్న కారణంతో పోలీసులు ఓ మేకను అరెస్ట్ చేసిన వింత ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని బెకన్‌గంజ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. రోడ్డుపై మేకను తీసుకెళ్తున్న దాని యజమానిని పోలీసులు అడ్డగించి.. మేకకు మాస్కు పెట్టలేదేంటని ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు బిత్తరపోయిన మేక యజమాని భయంతో మేకను అక్కడే వదిలేసి అక్కడినుంచి పారిపోయాడు. పోలీసులు దానిని స్టేషన్‌కు తరలించారు. కాసేపయ్యాక యజమాని వచ్చి మేక కనపించలేదు. దాంతో అతను పోలీస్‌స్టేషన్ వెళ్లక తప్పలేదు.
మాస్కు లేకపోవడంతో మేకన అరెస్టు చేశామని పోలీసులు చెప్పడంతో అతను షాక్ తిన్నాడు. ఎలాగోలా పోలీసులు బతిమాలుకుని మేకను విడిపించుకున్నాడు. అయితే, మాస్క్ ధరించకపోతే మేకను అరెస్ట్ చేయడమేంటని పోలీసులన అడగ్గా.. వారు తమ చర్యను సమర్థించుకున్నారు. కుక్కలకు కూడా మాస్కులు పెడుతున్నప్పుడు మరి మేకలకు కూడా మాస్కులు ఎందుకు ఉండకూడదంటూ ఎదురు ప్రశ్నించారు. ఇంకెప్పుడూ మేకను రోడ్డుపైకి తీసుకురానని యజమాని పోలీసులకు తెలిపాడు. రోడ్డుపైకి రావాల్సి వచ్చినా మాస్కు పెడతానని చెప్పాడు. పోలీసుల బిత్తిరి చర్యపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. (గ్రామస్తుల త్యాగంతో పిచ్చుక, పిల్లలు క్షేమం)
Comments
Please login to add a commentAdd a comment