చర్మ సౌందర్యాన్ని ఇనుమడింప చేయడంలో శనగపిండి స్పెషల్. అన్ని రకాల చర్మతత్త్వాలకు శనగపిండి బాగా పనిచేస్తుంది. రోజుల పాపాయికి కూడా చలి కాలంలో శనగపిండితో నలుగు పెట్టి స్నానం చేయించేవాళ్లు.
శనగపిండి–పసుపు మాస్క్
ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల పాలు కాని తాజా మీగడ కాని కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు వీలైతే శరీరం మొత్తానికి రాసుకోవచ్చు. ఆరిన తర్వాత మాస్క్‌ని వేళ్లతో సున్నితంగా రుద్దుతూ తీసేయాలి. ఇది ముఖంపై ఉన్న దుమ్ము,ధూళిని తీసివేసి చర్మాన్ని ఫ్రెష్‌గా, సున్నితంగా తయారు చేస్తుంది.
శనగపిండి – ఆరెంజ్ పీల్ మాస్క్
ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో పావు టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ (పౌడర్ లేనప్పుడు పీల్‌ని మెత్తగా గ్రైండ్ చేసి ఆ గుజ్జును వాడాలి), ఒక టేబుల్ స్పూన్ చిలికిన పెరుగు, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఆరిపోయే వరకు ఉంచి మెల్లిగా రుద్ది తీసేయాలి. ఈ మాస్క్‌ను వదిలించేటప్పుడు గట్టిగా రుద్ద కూడదు.
Comments
Please login to add a commentAdd a comment