Gram flour
-
బ్యూటీపార్లర్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి
ఫ్రూట్ ఫేషియల్, ఫేస్ ప్యాక్, ఎక్స్ ఫోలియేషన్ వంటి ట్రీట్మెంట్లతో అందానికి మెరుగులు దిద్దుకోవడానికి బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా మన ఇంట్లో ఉపయోగించే దినుసులతోనే. ♦టీ స్పూన్ శనగపిండిలో టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ఆరిన తరవాత మునివేళ్లతో వలయాకారంగా మర్దన చేయాలి, ఆ తర్వాత చన్నీటితో కడగాలి. ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్ వేయడం వల్ల చర్మం తగినంత తేమతో ఆరోగ్యంగా మెరుస్తుంది. నునుపుదనం సంతరించుకుంటుంది. ♦చర్మం మీద మృత కణాలు తొలగిపోవాలంటే టేబుల్ బియ్యప్పిండిలో టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ తేనె కలపాలి. ఇది హోమ్మేడ్ స్క్రబ్. దీనిని చేతులు, పాదాలకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత వేళ్లతో వలయాకారంగా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. రెండువారాలకొకసారి ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం నిగారిస్తుంది. -
బ్యూటిప్స్
చర్మం మీద చేరే జిడ్డు తొలగి చర్మం తాజాగా నిగనిగలాడాలంటే ఇంట్లోనే ఇలా చేసి చూడండి. ►బ్యూటిప్స్ నిమ్మకాయ ముక్కతో ఇరవై నిమిషాల పాటు ముఖమంతా మర్దనా చేసి, చల్లటి నీటితో కడగాలి. (పొడి చర్మానికి ఈ చికిత్స పనికిరాదు). ►పలుచని ఆపిల్ ముక్కతో ముఖం, మెడ, చేతులు రుద్దుకుంటే చర్మగ్రంధుల నుంచి వెలువడే అదనపు నూనె తొలగిపోతుంది. ►అరటిపండు గుజ్జులో రెండు చుక్కల తేనె, రెండు చుక్కల గ్లిజరిన్, అర స్పూన్ నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. ►శనగపిండి కాని, పెసర పిండి కాని పాలతో కలుపుకుని స్నానానికి సబ్బుకు బదులుగా ఉపయోగించవచ్చు. ►మెంతులలో పాలు వేసి గ్రైండ్ చేసి ముఖానికి ప్యాక్ వేసి, ఆరిన తర్వాత వేడి నీటితో కడగాలి. -
బ్యూటిప్స్
శనగపిండితో అందం... టేబుల్ స్పూన్ శనగపిండిలో అర టేబుల్ స్పూన్ రోజ్‌వాటర్, చిటికెడు పసుపు కలిపి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కడిగిన ముఖానికి పట్టించాలి. ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.టేబుల్ స్పూన్ శనగపిండిలో గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ గంధం పొడి కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌లు అన్ని రకాల చర్మాల వారికి అనువుగా ఉంటాయి. వారంలో ఒక్కసారి ఈ ప్యాక్‌లను వాడడం వలన చర్మకాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది. బ్లాక్ హెడ్స్ నివారణ కోసం... అయిదారు కప్పుల నీటిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మరగబెట్టాలి. మరిగిన తరవాత ఆ పాత్రని టేబుల్ మీద ఉంచి ముఖానికి ఆవిరి పట్టించాలి. టవల్‌తో బ్లాక్ హెడ్స్ ఉన్న చోట నెమ్మదిగా రుద్దాలి. ఇలా రెండు, మూడుసార్లు చేయాలి. అయిదు నిమిషాల తరవాత చన్నీటితో ముఖాన్ని కడగాలి. ఆ తరవాత చర్మానికి సరిపోయే ఫేస్‌ప్యాక్ వేసి ఆరిన తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.టేబుల్ స్పూన్ పెరుగులో టీ స్పూన్ బియ్యంపిండి కలిపి పెట్టుకోవాలి. ముఖానికి ఆవిరి çపట్టించిన తరవాత ఈ మిశ్రమాన్ని బ్లాక్ హెడ్స్ ఉన్నచోట అప్లై చేసి, వేళ్లతో వలయాకారంలో నెమ్మదిగా రుద్దాలి. ఇలా వారంలో రెండుసార్లు క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై ఏర్పడ్డ బ్లాక్‌హెడ్స్ తగ్గుతాయి. -
చమక్కు స్కిన్
చర్మ సౌందర్యాన్ని ఇనుమడింప చేయడంలో శనగపిండి స్పెషల్. అన్ని రకాల చర్మతత్త్వాలకు శనగపిండి బాగా పనిచేస్తుంది. రోజుల పాపాయికి కూడా చలి కాలంలో శనగపిండితో నలుగు పెట్టి స్నానం చేయించేవాళ్లు. శనగపిండి–పసుపు మాస్క్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల పాలు కాని తాజా మీగడ కాని కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు వీలైతే శరీరం మొత్తానికి రాసుకోవచ్చు. ఆరిన తర్వాత మాస్క్‌ని వేళ్లతో సున్నితంగా రుద్దుతూ తీసేయాలి. ఇది ముఖంపై ఉన్న దుమ్ము,ధూళిని తీసివేసి చర్మాన్ని ఫ్రెష్‌గా, సున్నితంగా తయారు చేస్తుంది. శనగపిండి – ఆరెంజ్ పీల్ మాస్క్ ఒక టేబుల్ స్పూన్ శనగపిండిలో పావు టీ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్ (పౌడర్ లేనప్పుడు పీల్ని మెత్తగా గ్రైండ్ చేసి ఆ గుజ్జును వాడాలి), ఒక టేబుల్ స్పూన్ చిలికిన పెరుగు, ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలిపి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. ఆరిపోయే వరకు ఉంచి మెల్లిగా రుద్ది తీసేయాలి. ఈ మాస్క్‌ను వదిలించేటప్పుడు గట్టిగా రుద్ద కూడదు. -
ఇంటిప్స్
• ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటుంది. • పచ్చిమిర్చి తొడిమలు తీసి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. • బియ్యప్పిండి, శనగపిండి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫాలిథిన్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.