ఫ్రూట్ ఫేషియల్, ఫేస్ ప్యాక్, ఎక్స్ ఫోలియేషన్ వంటి ట్రీట్‌మెంట్‌లతో అందానికి మెరుగులు దిద్దుకోవడానికి బ్యూటీ పార్లర్‌కు వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా మన ఇంట్లో ఉపయోగించే దినుసులతోనే.
♦టీ స్పూన్ శనగపిండిలో టీ స్పూన్ పెరుగు, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ఆరిన తరవాత మునివేళ్లతో వలయాకారంగా మర్దన చేయాలి, ఆ తర్వాత చన్నీటితో కడగాలి. ఈ హెర్బల్ ఫేస్ ప్యాక్ వేయడం వల్ల చర్మం తగినంత తేమతో ఆరోగ్యంగా మెరుస్తుంది. నునుపుదనం సంతరించుకుంటుంది.
♦చర్మం మీద మృత కణాలు తొలగిపోవాలంటే టేబుల్ బియ్యప్పిండిలో టేబుల్ స్పూన్ పెరుగు, టీ స్పూన్ తేనె కలపాలి. ఇది హోమ్‌మేడ్ స్క్రబ్. దీనిని చేతులు, పాదాలకు పట్టించి ఐదు నిమిషాల తర్వాత వేళ్లతో వలయాకారంగా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. రెండువారాలకొకసారి ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి చర్మం నిగారిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment