లండన్: ఊపిరితిత్తులు లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు కరోనా–మాస్క్‌లు ధరించరాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. ఇవి ధరించడం వల్ల వారికి శ్వాసకోశ సంబంధిత సమస్యలు మరింత తీవ్రమైయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. సాధారణ ప్రజలు బిగువుగా ఉండే మాస్క్‌లను ధరించడం వల్ల వారికి ఆక్సిజన్ సరిగ్గా అందక ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని, వారు కూడా ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్‌లు ధరించక పోవడమే మంచిదని వారు సూచించారు. బయటకు వెళ్లినప్పుడు, అదీ పక్కవారితో రెండు మీటర్లు భౌతిక దూరాన్ని పాటించడం కుదరనప్పుడు మాత్రమే బిగువైన మాస్క్‌లను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మాస్క్‌ల గురించి ఆది నుంచి నిపుణుల పరస్పర విరుద్ధమైన ప్రకటనలతోని గందరగోళం నెలకొని ఉంది. తాజా ప్రకటనతోని అది మరింత గందరగోళంగా మారింది. సర్జికల్ మాస్క్‌లనేవి సర్జికల్ సిబ్బంది నుంచి రోగులకు రక్షణ కల్పించడంలో భాగంగా వచ్చాయని, వారు, వారితోపాటు రోగులు మాత్రమే మాస్క్‌లు ధరిస్తే సరిపోతుందనే వార్తలు తొలుత వచ్చాయి. సాధారణ సర్జికల్ మాస్క్‌ల వల్ల ప్రయోజనం లేదని, మూడు పొరలు కలిగిన ఎన్–95, అంతకన్నా నాణ్యమైన మాస్క్‌లు వేసుకోవడమే ప్రయోజనకరమని వైద్య నిపుణులు ఆ తర్వాత సూచించారు. (‘కరోనా’ను అడ్డుకునే మాస్క్‌లేమిటి?)
వదులుగా ఉండే మాస్క్‌ల వల్ల లాభం లేదని, బిగుతుగా ఉండే మాస్క్‌లతోనే ప్రయోజనమంటూ ఆ తర్వాత వివరణలు వచ్చారు. రోగులు తప్పా ఇతరులు మాస్క్‌లను వాడడం వల్ల వారికి ప్రయోజనంకన్నా రిస్కే ఎక్కువంటూ హెచ్చరికలు చేశారు. మాటిమాటికి మాస్క్‌లను చేతులతోని సర్దు కోవడం వల్ల లేనివారు కూడా అనవసరంగా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి గందరగోళం కొనసాగుతుండగానే, ఎవరికి వైరస్ సోకిందో, ఎవరికి సోకలేదో తెలియదుకనుక ప్రజలందరూ మాస్క్‌లు ధరించాలంటే ప్రభుత్వాలే హెచ్చరికలు జారీ చేశాయి. పైగా 200 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఇప్పుడేమో బిగువైన మాస్క్‌ల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పా మిగతా వేళల్లో మాస్క్‌లు ధరించవద్దని చెబుతున్నాయి. (కరోనా: రోడ్డున పడ్డ 11 లక్షల మంది)
Comments
Please login to add a commentAdd a comment