breathing problems
-
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వనజీవి రామయ్య
సాక్షి, ఖమ్మం: పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రకృతి ప్రేమికుడు వనజీవి రామయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చేర్చి వైద్యులు ప్రత్యేక వైద్య సేవలందించారు. ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో రామయ్య ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని రామయ్యకు సూచించారు. విశ్రాంతి తీసుకోవడం అవసరం కాగా ఇటీవల వనజీవి రామయ్య మరోసారి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గడిచిన మూడు నెలల వ్యవధిలో మూడు సార్లు అస్వస్థతకు గురయ్యారు రామయ్య. ప్రస్తుతం ఆయ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తెలిపారు. హరితహరంలో భాగంగా రామయ్య గ్రామాల్లో తిరుగుతు చెట్లు నాటుతు ఉండటం వల్ల శ్వాస కోశ ఇబ్బందులు వచ్చాయని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రామయ్య బయట తిరగకుండా విశ్రాంతి తీసుకోవడం అవసరమన్నారు. వయసు భారం దృష్ట్య రామయ్య కోన్ని ఆనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పుతున్నారన్నారు. కాగా గత కొంతకాలంగా వనజీవి రామయ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రిలో చేరిన రామయ్య అనంతరం కోలుకున్నారు. అయితే నిరంతరం మొక్కల గురించి ఆలోచించే ఆయన.. ఏంత ఇబ్బంది ఉన్న మొక్కలను నాటే కార్యక్రమంను మాత్రం ఏ రోజు వాయిదా వేయరు. ప్రతి రోజు మొక్కలను నాటుతునే ఉండాలన్నది ఆ కోరిక. అంతేకాదు తన చివరి శ్వాస పోయే వరకు కూడా మొక్కలను నాటుతునే ఉంటానని సాక్షి ఇంటర్వ్యూలో కూడ రామయ్య చెప్పుకొచ్చారు. 50ఏళ్ల నుంచి మొక్కలను నాటుతూ వస్తున్న రామయ్య.. ఇప్పటి వరకు 3కోట్ల మొక్కలను నాటారు. -
ఒక్కోసారి ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంటుంది..
ఒక్కోసారి ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంటుంది. అటువంటప్పుడు కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి. అవేమిటంటే...ఊపిరితిత్తుల్లో గాలి నిండేలా గుండెల నిండా ఊపిరి బలంగా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వీలైనంత ఎక్కువ సేపు దాన్ని లంగ్స్‌లో నిలపాలి. ఆ తర్వాత నింపాదిగా వదలాలి. ఇలా కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. ఈ వ్యాయామానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం అంటూ ఉండదు. కూర్చుని ఎప్పుడు గుర్తుకు వస్తే అప్పుడు కూడా చేసుకోవచ్చు. ప్రయోజనాలు: ఇలా గుండెల నిండుగా గాలి పీల్చుకుంటూ చేసే వ్యాయామాలతో (డీప్ బ్రీతింగ్‌తో) ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు ఊపిరితిత్తుల సంకోచవ్యాకోచాలకు తోడ్పడే ఉదరవితానం (డయాఫ్రమ్) కూడా బలంగా అయ్యేందుకు తోడ్పడుతుంది. డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్గా చెప్పే ఈ వ్యాయామం వల్ల మానసిక ఒత్తిడి (స్ట్రెస్), యాంగై్జటీ కూడా తగ్గుతాయి. నిద్ర నాణ్యత (క్వాలిటీ ఆఫ్ స్లీప్) పెరుగుతుంది. -
మాస్క్‌లతో శ్వాసకోశ సమస్యలు!
లండన్: ఊపిరితిత్తులు లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలు కరోనా–మాస్క్‌లు ధరించరాదని బ్రిటన్ శాస్త్రవేత్తలు తాజాగా హెచ్చరించారు. ఇవి ధరించడం వల్ల వారికి శ్వాసకోశ సంబంధిత సమస్యలు మరింత తీవ్రమైయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. సాధారణ ప్రజలు బిగువుగా ఉండే మాస్క్‌లను ధరించడం వల్ల వారికి ఆక్సిజన్ సరిగ్గా అందక ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉందని, వారు కూడా ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్‌లు ధరించక పోవడమే మంచిదని వారు సూచించారు. బయటకు వెళ్లినప్పుడు, అదీ పక్కవారితో రెండు మీటర్లు భౌతిక దూరాన్ని పాటించడం కుదరనప్పుడు మాత్రమే బిగువైన మాస్క్‌లను ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్‌ల గురించి ఆది నుంచి నిపుణుల పరస్పర విరుద్ధమైన ప్రకటనలతోని గందరగోళం నెలకొని ఉంది. తాజా ప్రకటనతోని అది మరింత గందరగోళంగా మారింది. సర్జికల్ మాస్క్‌లనేవి సర్జికల్ సిబ్బంది నుంచి రోగులకు రక్షణ కల్పించడంలో భాగంగా వచ్చాయని, వారు, వారితోపాటు రోగులు మాత్రమే మాస్క్‌లు ధరిస్తే సరిపోతుందనే వార్తలు తొలుత వచ్చాయి. సాధారణ సర్జికల్ మాస్క్‌ల వల్ల ప్రయోజనం లేదని, మూడు పొరలు కలిగిన ఎన్–95, అంతకన్నా నాణ్యమైన మాస్క్‌లు వేసుకోవడమే ప్రయోజనకరమని వైద్య నిపుణులు ఆ తర్వాత సూచించారు. (‘కరోనా’ను అడ్డుకునే మాస్క్‌లేమిటి?) వదులుగా ఉండే మాస్క్‌ల వల్ల లాభం లేదని, బిగుతుగా ఉండే మాస్క్‌లతోనే ప్రయోజనమంటూ ఆ తర్వాత వివరణలు వచ్చారు. రోగులు తప్పా ఇతరులు మాస్క్‌లను వాడడం వల్ల వారికి ప్రయోజనంకన్నా రిస్కే ఎక్కువంటూ హెచ్చరికలు చేశారు. మాటిమాటికి మాస్క్‌లను చేతులతోని సర్దు కోవడం వల్ల లేనివారు కూడా అనవసరంగా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి గందరగోళం కొనసాగుతుండగానే, ఎవరికి వైరస్ సోకిందో, ఎవరికి సోకలేదో తెలియదుకనుక ప్రజలందరూ మాస్క్‌లు ధరించాలంటే ప్రభుత్వాలే హెచ్చరికలు జారీ చేశాయి. పైగా 200 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు జరిమానాలు విధిస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఇప్పుడేమో బిగువైన మాస్క్‌ల వల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లో తప్పా మిగతా వేళల్లో మాస్క్‌లు ధరించవద్దని చెబుతున్నాయి. (కరోనా: రోడ్డున పడ్డ 11 లక్షల మంది) -
'శ్వాసకోశ సమస్యతోనే బన్నప్ప మృతి'
గాంధీ ఆస్పత్రి: శ్వాసకోశ సంబంధ సమస్యతోనే మారేడుపల్లి గాంధీనగర్‌కు చెందిన బన్నప్ప మృతి చెందినట్లు గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమిక నివేదికలో ధ్రువీకరించారని తెలిసింది. పోలీసులు కొట్టి చంపారనే ఆరోపణలతో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి మారేడుపల్లి ఠాణాపై దాడిచేసి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం బన్నప్ప మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి ఒంటిపైన, అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని, ఎడమకాలికి చిన్న గాయం మాత్రమే ఉందని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది. మృతుడి కడుపులో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని, పడుకున్న సమయంలో వాంతులు కావడంతో, ఆహార పదార్థం శ్వాసకోశ నాళానికి అడ్డుపడి శ్వాసలో ఇబ్బంది పడి బన్నప్ప మృతి చెంది ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులకు చెందిన భాగాలతోపాటు, మరికొన్ని శరీర భాగాలను (విస్రా)ను సేకరించి వైద్య పరీక్షలకు పంపించామని తెలిపారు.