ఒక్కోసారి ఊపిరి ఆడనట్లు అనిపిస్తుంటుంది. అటువంటప్పుడు కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి. అవేమిటంటే...ఊపిరితిత్తుల్లో గాలి నిండేలా గుండెల నిండా ఊపిరి బలంగా తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత వీలైనంత ఎక్కువ సేపు దాన్ని లంగ్స్‌లో నిలపాలి. ఆ తర్వాత నింపాదిగా వదలాలి. ఇలా కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయండి. ఈ వ్యాయామానికి ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సిన అవసరం అంటూ ఉండదు. కూర్చుని ఎప్పుడు గుర్తుకు వస్తే అప్పుడు కూడా చేసుకోవచ్చు.
ప్రయోజనాలు: ఇలా గుండెల నిండుగా గాలి పీల్చుకుంటూ చేసే వ్యాయామాలతో (డీప్ బ్రీతింగ్‌తో) ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాదు ఊపిరితిత్తుల సంకోచవ్యాకోచాలకు తోడ్పడే ఉదరవితానం (డయాఫ్రమ్) కూడా బలంగా అయ్యేందుకు తోడ్పడుతుంది. డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌గా చెప్పే ఈ వ్యాయామం వల్ల మానసిక ఒత్తిడి (స్ట్రెస్), యాంగై్జటీ కూడా తగ్గుతాయి. నిద్ర నాణ్యత (క్వాలిటీ ఆఫ్ స్లీప్) పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment