గాంధీ ఆస్పత్రి: శ్వాసకోశ సంబంధ సమస్యతోనే మారేడుపల్లి గాంధీనగర్‌కు చెందిన బన్నప్ప మృతి చెందినట్లు గాంధీ ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమిక నివేదికలో ధ్రువీకరించారని తెలిసింది. పోలీసులు కొట్టి చంపారనే ఆరోపణలతో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రాత్రి మారేడుపల్లి ఠాణాపై దాడిచేసి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం బన్నప్ప మృతదేహానికి గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతుడి ఒంటిపైన, అంతర్గతంగా ఎలాంటి గాయాలు లేవని, ఎడమకాలికి చిన్న గాయం మాత్రమే ఉందని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది. మృతుడి కడుపులో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని, పడుకున్న సమయంలో వాంతులు కావడంతో, ఆహార పదార్థం శ్వాసకోశ నాళానికి అడ్డుపడి శ్వాసలో ఇబ్బంది పడి బన్నప్ప మృతి చెంది ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. మెదడు, గుండె, ఊపిరితిత్తులకు చెందిన భాగాలతోపాటు, మరికొన్ని శరీర భాగాలను (విస్రా)ను సేకరించి వైద్య పరీక్షలకు పంపించామని తెలిపారు.
'శ్వాసకోశ సమస్యతోనే బన్నప్ప మృతి'
Published Tue, Aug 4 2015 6:21 PM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM
Advertisement