
పుణె: కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల నేపథ్యంలో నిబంధనలు ఉల్లఘించిన వారిపై మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. లాక్‌డౌన్‌లో ఇంటి నుంచి బయటకు రాడమే కాకుండా, ముఖానికి మాస్క్ పెట్టుకోలేదన్న ఆరోపణలతో ఏడుగురిపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. కుడ్లీవాడీ ప్రాంతానికి చెందిన ఈ ఏడుగురు గురువారం మాస్క్ లేకుండా బయట తిరుగుతుండటంతో పింప్రీ-చించవాద్ పోలీసులు ఈ మేరకు చర్య తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.
కోవిడ్-19 విస్తృతి నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో విధిగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించని వారిని అరెస్ట్ చేసేందుకు వెనుకాడమని బీఎంసీ అధికారులు హెచ్చరించారు. కాగా, దేశంలోని చాలా నగరాల్లో ఈ నిబంధన అమలు చేస్తున్నారు. ఢిల్లీ, ముంబైతో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేశాయి. జమ్మూకశ్మీర్‌లో కూడా ముఖానికి మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. మాస్క్ లేకుండా బయటకు వస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
చదవండి: కరోనా.. ఐటీ శాఖ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment