
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం భాంజీపేటలో మాస్క్‌లు లేని చిన్నారులతో ఓ పంచాయతీ కార్యదర్శి రహదారిపై కప్పగంతులు వేయించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీరంగారెడ్డి మంగళవారం గ్రామంలో పర్యటిస్తూ మాస్క్‌లు ధరించని ఇద్దరికి జరిమానా వేశారు. ఆ తర్వాత పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు మాస్క్ లేకుండా కనిపించగా.. వారిని కప్పగంతులు వేయాలని ఆదేశించారు.
దీంతో చిన్నారులు మోకాళ్లపై కొద్దిదూరం కప్పగంతులు వేయగా, స్థానికులు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. కాగా, ఈ విషయమై శ్రీరంగారెడ్డి మాట్లాడుతూ కరోనాపై చిన్నారులకు అవగాహన కల్పించేందుకు కప్పగంతులు వేయించానే తప్ప మరే ఉద్దేశం లేదని తెలిపారు.
ఒకే ఇంట్లో ఆరుగురికి పాజిటివ్ .. బాధితుల్లో ఐదు నెలల బాబు
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని అక్కపెల్లిగూడెంలో ఒకే ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఇప్పగూడెం పీహెచ్‌సీ వైద్యాధికారి మౌనిక తెలిపారు. పీహెచ్‌సీకి వచ్చిన కుటుంబ సభ్యులను పరీక్షించగా కుటుంబంలోని ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. కాగా, బాధితుల్లో ఐదు నెలల వయసు కలిగిన బాబు కూడా ఉన్నాడని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment