సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు బీఎంసీ సిబ్బంది చాలా హుషారుగా పని చేస్తున్నారు. ఒకే రోజు మాస్క్ ధరించని 12 వేలకుపైగా మందిని పట్టుకుని రూ.24 లక్షలు జరిమాన వసూలు చేశారు. ఇలా బీఎంసీ సిబ్బంది ఇప్పటి వరకు దాదాపు 68 లక్షల మంది నుంచి రూ.14 కోట్లకుపైనే జరిమాన వసూలు చేయడంతో బీఎంసీ ఖజానాలోకి భారీగా అదనపు ఆదాయం వచ్చి చేరింది. కరోనా తీవ్రత రోజురోజుకు తగ్గుముఖం పట్టడం కొంత ఊరటనిచ్చే విషయమే. కానీ, మాస్క్ ధరించకుండా పట్టుబడుతున్న కేసులు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో బీఎంసీకి చెందిన ఆరోగ్య శాఖ ఆందోళనలో పడిపోయింది.
20 వేలకు తగ్గొద్దని..
కరోనా వైరస్‌ను నియంత్రణలో ఉంచాలంటే జనాలు మాస్క్ ధరించడం తప్పని సరిచేశారు. కొందరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. పట్టుబడితే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇలాంటి వారికి ముకుతాడు వేసేందుకు బీఎంసీ ఆరోగ్య సిబ్బందితోపాటు క్లీన్ అప్ మార్షల్స్, అధికారులు, ఫ్లయింగ్ స్కాడ్‌లు దాడులు చేస్తున్నారు. ప్రతీరోజు 20–24 వేల మందిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల బీఎంసీ కమిషనర్ ఇక్బాల్‌సింగ్ చహల్ ఆంక్షలు విధించారు. ఆ మేరకు దాడులు మరింత ఉధృతం చేశారు.
రోజు ఐదారు వేల మందిని పట్టుకుని జరిమానా విధించేవారు. కానీ, మంగళవారం రోజంతా దాదర్, మాటుంగా, సైన్, అంధేరీ, గోరేగావ్, మలాడ్ తదితర రద్దీ ఉండే ప్రాంతాల్లో తిరిగి మాస్‌్కలు ధరించని 12 వేలకుపైగా జనాలకు జరిమానా విధించారు. ఒకేరోజు ఇలా భారీ సంఖ్యలో జనాకు జరిమానా విధించడం ఇదే ప్రథమమని బీఎంసీ తెలిపింది. ఇదిలాఉండగా ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 68,38,060 మందిపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి రూ.14,04,06,200 జరిమాన వసూలు చేసినట్లు బీఎంసీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment