
కరోనా వైరస్ కారణంగా మార్కెట్లో రకరకాలైన ఫేస్ మాస్కులు లభ్యమవుతున్నాయి. అయితే జపాన్‌కు చెందిన ఓ దుకాణంలో మాత్రం వీటిని మరింత స్పెషల్‌గా డిజైన్ చేశారు. వీటితో మన ఫేస్‌ని కంప్లీట్‌గా కవర్‌చేస్తూ ఇతరుల పోలికలు ఉన్న మాస్క్‌ని ధరించవచ్చు. దీంతో మాస్క్ వెనకుంది ఎవరున్నారో కూడా గుర్తేపట్టనంతగా వీటిని తీర్చిదిద్దారు. అచ్చం మనిషి పోలికలతో ఎంతో రియలిస్టిక్‌గా రూపొందించిన ఈ ఫేస్ మాస్క్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి ప్రారంభం అవుతాయని దుకాణపు యజమాని షుహీ ఓకావారా తెలిపారు. వెనిస్‌లోని ఈ షాపుకు సాధారణంగానే కస్టమర్లు క్యూ కడుతుంటారు. వివిధ రకాల పార్టీలు, నాటక ప్రదర్శనల్లోనూ వీరి ఉత్పత్తులు స్థానికంగా బాగా ఫేమస్ అయ్యాయి.
ఇప్పుడు అదే ఉత్సాహంతో అక్టోబరులో ఈ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. 3డి ప్రింటింగ్ ఉన్న ఈ ఫేస్‌మాస్కులకు గిరాకీ బాగానే ఉందని, భవిష్యత్తులో మరింత పుంజుకుంటుదని ఓకావారా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే 100కు పైగానే ఆర్డర్లు వచ్చాయని, విదేశాల నుంచి కూడా వీటికి గిరాకీ ఉందని తెలిపారు. ఒక్కో మాస్క్ ధర దాదాపు 98,000 యెన్లకు (రూ .69,832) ఉండనుంది. అయితే ఇవి సాధారణ ఫేస్ మాస్కుల వలె వైరస్ నుంచి రక్షించలేవు. కానీ మనకు నచ్చిన ముఖాన్ని ధరించే సౌలభ్యాన్ని మాత్రం పొందవచ్చు. మాస్క్ వెనక ఎంకెవరైనా ఉన్నారన్న సందేహం కూడా కలగకుండకుండా వీటిని డిజైన్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment