ఫేస్ మాస్క్ ధరించినట్లుగా కనిపిస్తున్న ఓ గ్రహశకలం ఫొటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. దాదాపు మౌంట్ ఎవరెస్ట్‌లో సగపరిమాణం ఉన్న ఈ గ్రహశకలం ఫొటోలను నాసా శాస్త్రవేత్తల బృందం ట్విటర్‌లో శుక్రవారం షేర్ చేసింది. అత్యంత పెద్ద పరిమాణాన్ని కలిగిన గ్రహశకలం.. కనీసం 1.5 కిలోమీటర్ల వెడల్పు ఉంటుందని శాస్త్రవేత్తలు అంచన వేస్తున్నారు. అయితే ఇది వచ్చేవారంలో భూమి నుంచి ఎగురనున్నట్లు కూడా శాస్త్రవేత్తలు వెల్లడించారు. (కరోనా: చనిపోతానని తెలిసి.. భార్యను..!)
ఈ ఫొటోను ‘#రాడార్‌టీం,@NAICobservatory శాస్త్రవేత్తల బృందం.. సరైనా రక్షణ చర్యలతో పరిశీలిస్తున్న సమయంలో ఈ చిత్రాన్ని కనుగొన్నాము. దీనిని 1998 OR2 నాటి గ్రహశకలంగా గుర్తించాం. ఇది భూమీకి అత్యంత సమీపంలో ఉండి ముసుగును ధరించిన ఆకారంలో కనిపిస్తుంది’ అంటూ ట్వీట్ చేసిన ఈ ఫొటోకు ఫేస్ మాస్క్ ధరించి ఉన్న సిబ్బంది ఫొటోలను జత చేసి షేర్ చేశారు. ప్యూర్టో రికోలోని అరేసిబో అబ్జర్వేటరీ రాడార్ తీసిన ఈ ఫొటోలో గ్రహశకలం ఫేస్ మాస్క్‌ను ధరించినట్లు కనిపిస్తుండంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సిఎన్ఎన్ న్యూస్ ప్రకారం.. 52768 (1998 OR2) అని పిలువబడే గ్రహశకలం మొట్టమొదట 1998లో గుర్తించబడింది. ఏప్రిల్ 29న ఇది భూమికి 3.9 మిలియన్ మైళ్ళ దూరంలో వెళుతుందని, ఇది భూమి, చంద్రుల మధ్య 16 రెట్లు దూరం కలిగి ఉంటుందని సమాచారం.(అప్పట్లో స్కైల్యాబ్.. ఇప్పుడు కరోనా!)
#TeamRadar and the @NAICobservatory staff are taking the proper safety measures as we continue observations. This week we have been observing near-Earth asteroid 1998 OR2, which looks like it's wearing a mask! It's at least 1.5 km across and is passing 16 lunar distances away! pic.twitter.com/X2mQJCT2Qg
— Arecibo Radar (@AreciboRadar) April 18, 2020
కాగా అరేసిబో అబ్జర్వేటరీ రాడార్ ఇటీవల ఈ గ్రహశకలం చిత్రాన్ని తీసింది. అబ్జర్వేటరీలోని శాస్త్రవేత్తలు, టెలిస్కోప్ ఆపరేటర్ల బృందం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఫేస్‌మాస్క్ ధరించి పనిచేస్తుండగా రాడార్ పంపిన ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇది అచ్చం ఫేస్ మాస్క్‌ను ధరించినట్లు ఉండటంతో ఈ ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశారు. కాగా దాదాపు 500 అడుగుల మించిన పరిమాణంలో ఉన్న ఈ గ్రహశకలం భూమి కక్ష్య నుంచి 5 మిలియన్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది ప్రమాదకరమైన గ్రహశకలమని కూడా చెప్పారు. అయితే ఇది భూమి సమీపంలో ఉన్నప్పటికీ భూమిని తాకే అవకాశం లేదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment