మెక్సికో : ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై నిరసన జ్వాలలు చల్లారకముందే మరో ఉదంతం చోటుచేసుకుంది. మెక్సిలో ఆందోళనకారులు ఓ పోలీసుకు నిప్పటించారు. ఈ ఘటన మెక్సికోలోని గాదల్‌రాజారా నగరంలో చోటుచేసుకుంది. ముఖానికి మాస్క్ ధరించలేదన్న కారణంతో 30 ఏళ్ల వయసున్న లోపెజ్ అనే కార్మికుడిని మెంబ్రిలోస్ అనే పట్టణంలో మే 4న పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు పోలీసు కస్టడీలో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి.
(అమెరికా: పోలీసుల చర్యతో తల పగిలింది! )
ఈ నేపథ్యంలో గాదల్‌రాజారా నగరంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆగ్రహంతో ఊడిపోయిన నిరసనకారులు ఓ పోలీసు అధికారికి నిప్పంటించేశారు. వెంటనే స్పందించిన అధికారులు మంటలను ఆర్పివేసి అతడిని ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా పలు పోలీసు వాహనాలు సహా పలు భవనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండటంతో 22 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకోగా వారిలో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. (జార్జియాలో కూలిన విమానం; ఐదుగురు మృతి)
Comments
Please login to add a commentAdd a comment