కాలిఫోర్నియా : కరోనా వైరస్ వ్యాప్తితో మాస్కు ధరించడం అనివార్యంగా మారింది. బయటకు వెళ్లాలంటే తప్పని సరిగా మాస్క్ ఉండాల్సిందే. కొన్ని చోట్ల మాస్కు ధరించకుండా బహిరంగా ప్రదేశాలకు వచ్చే వారిపై జరిమాన సైతం విధిస్తున్నారు. ఈక్రమంలో ఓ రెస్టారెంట్‌కు మాస్కు ధరించకుండా వెళ్లిన మహిళకు వెయిటర్ సర్వ్ చేయని ఘటన కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో చోటుచేసుకుంది. అంతేగాక అతను చేసిన పని తనకు 32,000 డాలర్లను టిప్‌గా తెచ్చిపెట్టింది. వివరాలు.. అండర్ లిన్ గిల్లెస్ అనే మహిళ ఇటీవల స్టార్‌బక్స్ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేయగా, సదరు మహిళ ముఖానికి మాస్క్ ధరించనందున రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న లెనిన్ గుటిరెజ్ అనే వ్యక్తి ఆమెకు సర్వ్ చేసేందుకు నిరాకరించాడు. ఆమె ఎంత చెప్పినా వినకుండా మాస్క్ ఉంటేనే సర్వ్ చేయాలని, లేకుంటే చేయొద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని వెయిటర్ మొండి స్పష్టం చేశాడు. (భారత ఐటీపై హెచ్1బీ వీసాల రద్దు ప్రభావం?)
దీంతో వెయిటర్‌పై కోపంతో ‘మాస్క్ వేసుకోనందుకు కాఫీ తీసుకు రాలేదు’ అంటూ మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుపై లక్ష మందిపైగా కామెంట్ చేయగా, 50 వేల మంది షేర్ చేశారు. వీరిలో అనేకమంది నెటిజన్లు గిల్లెస్‌కు వ్యతిరేకంగా స్పందించారు. వెయిటర్ తన పని తాను నిర్వహించాడని లెనిన్‌ను ప్రశంసించారు. అంతేకాదు 32 వేల డాలర్లను అతడికి టిప్‌గా ఇచ్చారు. కాగా మే 1 నుంచి శాన్‌డియాగో ప్రజలు తప్పని సరి మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు, పార్కులు, షాపింగ్, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్కు ఉండాలని ఆదేశించింది. (చీటీల పేరుతో రూ. 2 కోట్ల టోకరా! )
ఇదిలా ఉండగా గిల్లెస్ పోస్టును చూసిన మాట్ కోవిన్ అనే ఓ వ్యక్తి లెనిన్‌కు ఎదైనా సాయం చేయేఆలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ పోస్టును ట్యాగ్ చేస్తూ ‘లెనిన్ స్టాండింగ్ అప్ టు ఏ శాన్ డియాగో కరెన్’ పేరుతో డొనేషన్‌పేజిని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ చేసి ఆ మెత్తాన్ని టిప్ రూపంలో లెనిన్‌కు ఇవ్వాలని అనుకున్నాడు. జూన్ 22న మొదటు పెట్టిన ఈ ఫండింగ్ ద్వారా శుక్రవారం సాయంత్రం వరకు 32 వేల డాలర్లు వసూలు చేశాడు. ఈ మెత్తాన్ని కోవిన్ లెనిన్‌కు అందించాడు. దీనిపై లెనిన్ మాట్లాడుతూ.. ఫండ్ అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమకు అందిన టిప్‌తో ఏం చేయాలో ఓ ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఈ డబ్బుతో డ్యాన్స్ స్కూల్ పెట్టి ఇతరులకు డ్యాన్స్ నేర్పిస్తానని వెల్లడించారు. (‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా? )
Comments
Please login to add a commentAdd a comment