మాస్క్‌ చాలెంజ్‌! | Mask Challange Viral in Social Media Hyderabad | Sakshi
Sakshi News home page

మాస్క్‌ చాలెంజ్‌!

Published Fri, Jul 10 2020 7:17 AM | Last Updated on Fri, Jul 10 2020 7:17 AM

Mask Challange Viral in Social Media Hyderabad - Sakshi

‘కరోనా’ విలయతాండవంచేస్తోంది. మాస్క్‌ లేకపోతేపోలీసులు చలాన్లు వేస్తున్నారు. మాస్క్‌ ధరిస్తే ఎదుటి వారినుంచి ఏ విధమైన హానిఉండదనేది ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం వెల్లడిస్తోంది.అయినా.. కొందరు ఏం కాదులే అంటూ మాస్క్‌ను ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఇటువంటి వారికోసం ‘డిగ్నిటీడ్రైవ్‌’ ఓ చాలెంజ్‌ విసురుతోంది. సోషల్‌ మీడియా వేదికగా ఆసంస్థ ప్రతినిధులు మాస్క్‌ ధరించి వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వీడియో అప్‌లోడ్‌ చేస్తున్నారు. టాగ్‌ చేసిన వారు ఆ చాలెంజ్‌ని స్వీకరించి మాస్క్‌ ధరించి ఓ వీడియోను రూపొందించాలి. మూడు రోజులుగా ఈ చాలెంజ్‌ సోషల్‌ మీడియా హాట్‌ టాపిక్‌గా
మారింది. ఏంటీ ఆ మాస్క్‌చాలెంజ్, ఎవరు ఎలా చేస్తున్నారు అనే విషయాలపై కథనం.

హిమాయత్‌నగర్‌: డిగ్నిటీ డ్రైవ్‌ ఫౌండేషన్‌(డీడీఎఫ్‌) ఫౌండర్‌ రినీగ్రేస్‌ జయకుమార్, స్ప్రెడ్డింగ్‌ హ్యాపీనెస్‌ సంస్థ ఫౌండర్‌ శిప్రాగాంధీ, రాబిన్‌హుడ్‌ ఆర్మీ(ఆర్‌హెచ్‌ఏ)లు ఓ సరికొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల మాస్క్‌లు లేకుండా చాలా మంది రోడ్లపై తిరుగుతున్న విషయాలను వీరు గమనించారు. మాస్క్‌లు ధరించకపోతే వారికి రావడమే కాకుండా.. ఎదుటి వారు సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉందనే ఆలోచన తట్టింది. అంతే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయా సంస్థల్లోని ప్రతినిధులంతా వాట్సాప్‌ గ్రూపుల్లో చర్చించుకుని ‘మాస్క్‌ చాలెంజ్‌’కు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరి వాట్సాప్‌ స్టేటస్‌లో చేరింది.  

సందేశం.. స్టేటస్‌..
‘కరోనా’ సమయంలో అసలు మాస్క్‌ ఎందుకు ధరించాలి? మాస్క్‌ ధరించడం వల్ల లాభాలు ఏంటి? మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఇతరులను సైతం ఎలా సేవ్‌ చేయాలి అనే అంశాలపై ఒకటి నుంచి రెండు నిముషాల నిడివిగల వీడియో రూపొందించి ఆ వీడియోను మరోఫ్రెండ్‌కి చాలెంజ్‌ చేయాలి. చాలెంజ్‌ని స్వీకరించిన వ్యక్తి కూడా తనకు నచ్చిన స్టైల్లో వీడియోనురూపొందించి మరొకరికి చాలెంజ్‌ చేయాలి.
ఇలా నాలుగు రోజులుగా నగరంలోని సాఫ్ట్‌వేర్‌కంపెనీల్లో టెకీలుగా చేసేవారంతా ఈ చాలెంజ్‌స్వీకరించడం గమనార్హం. టెకీలతో పాటు ఇంట్లోని తల్లిదండ్రులను సైతం చాలెంజ్‌లోకి లాగడంస్ఫూర్తిదాయకంగా ఉంది. ఇలా రూపొందించినప్రతి ఒక్కరూ తమ వాట్సాప్‌ స్టేటస్‌లలో స్టోరీగా పెట్టుకోవడంతో.. ఆ స్టోరీని చూసిన వారు సైతం చాలెంజ్‌ స్వీకరించడం భలే సంతోషాన్నిఇస్తుందంటున్నారు నిర్వాహకులు. ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ అందరూ మాస్కులు ధరిస్తే లక్ష్యం నెరవేరినట్లేనని అంటున్నారు.

మాస్క్‌ చాలెంజ్‌ స్వీకరిస్తున్నా..
మాస్క్‌ చాలెంజ్‌ నాకెంతో నచ్చింది. సమాజాన్ని అవగాహన కోణంలోకి తెప్పించి ప్రతిఒక్కరూ మాస్క్‌ధరించేలా చేయడమే ఈ చాలెంజ్‌ లక్ష్యం. అందుకే డిగ్నిటీడ్రైవ్, స్ప్రెడ్డింగ్‌ హ్యాపినెస్, రాబిన్‌హుడ్‌ ఆర్మీ వాళ్లు నన్ను అడగ్గానే ఒప్పుకున్నాను. ఒప్పుకున్నాను అనే దానికంటే చాలెంజ్‌ని స్వీకరించానంటే బాగుంటుందేమో..(నవ్వుతూ). అందరూ మాస్క్‌ చాలెంజ్‌లో భాగస్వాములు కావాలి. – సజ్జనార్, సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌.

భాగస్వాముల్నిచేసేందుకే చాలెంజ్‌
ప్రతి ఒక్కరినీ భాగస్వాముల్ని చేసేందుకే ఈ చాలెంజ్‌కు శ్రీకారం చుట్టాం. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి ఓ సందేశాన్ని పంపిస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిలోనూ మంచి అవగాహన వస్తుందనేది మా నమ్మకం. – రినీగ్రేస్‌ జయకుమార్, డిగ్నిటీడ్రైవ్‌ ఫౌండేషన్‌ ఫౌండర్‌.

మంచి పనితో ముందుకు..
ఓ చక్కని మంచి పనితో మేమంతా ముందుకెళ్తున్నాం. మీరు కూడా మీకు సంబంధించిన వాట్సాప్‌ గ్రూపుల్లో చాలెంజ్‌ని విసురుకోండి. ఆ చాలెంజ్‌లో భాగస్వాములు అవ్వండి. మాస్క్‌ ధరిద్దాం‘కరోనా’ను తరిమి కొడదాం. – ఉమా చిలక్, రాబిన్‌హుడ్‌ ఆర్మీ, సిటీ హెడ్‌.

ఆనందంగా అనిపిస్తుంది
నాలుగు రోజులుగా కొన్ని వేలమంది ఈ చాలెంజ్‌లో పాల్గొనడాన్ని చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది. మాస్క్‌ ధరించడం వల్ల మనల్ని మనం రక్షించుకుంటామనేది యావత్‌ ప్రపంచానికి ఈ చాలెంజ్‌ ద్వారా తెలపగలుగుతున్నాం.– శిప్రా గాంధీ,స్ప్రెడ్డింగ్‌ హ్యాపినెస్‌ ఫౌండర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement