కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విజయ్ దేవరకొండ ముందు నుంచీ సలహాలు అందిస్తూనే ఉన్నాడు. తాజాగా మాస్కుల కొరత ఎక్కువగా ఉందన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభిమానులకు ఓ ముఖ్య విషయాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కర్ఛీఫ్ ధరించి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. "ప్రియమైన అభిమానులందరూ జాగ్రత్తగానే ఉన్నారని ఆశిస్తున్నాను. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు అందరూ ఏదో ఒకలాగానైనా ముఖాన్ని కవర్ చేసుకోండి. (ఆ ఇద్దరితో నటించాలని ఉంది: విజయ్)
అయితే మాస్క్‌లు మాత్రం వైద్యులకు వదిలేయండి. దానికి బదులుగా కర్ఛీఫ్ కట్టుకోండి. లేదంటే స్కార్ఫ్ ధరించండి, అదీ కుదరకపోతే కనీసం మీ తల్లి చున్నీనైనా వాడండి" అని సూచించాడు. అయితే విజయ్ టిప్స్‌పై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. మమ్మీ చున్నీ కట్టుకుని అబ్బాయిలు రోడ్లపై ఎలా తిరుగుతారు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు అతని అభిమానులు మాత్రం.. విజయ్ ఏది చెప్పినా క్రేజీగా ఉంటుందని వెనకేసుకొస్తున్నారు. కాగా ఈ రౌడీ మోస్ట్ డిజైరబుల్ మెన్-2019 జాబితాలో వరుసగా రెండో సారి మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. (వరుసగా రెండోసారి రౌడీనే..)
Comments
Please login to add a commentAdd a comment