బరేలీ(యూపీ): ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. మాస్కు పెట్టుకోలేదనే కారణంతో తన కొడుకు చేతులు, కాళ్లలో మేకులు దించారంటూ ఆరోపించింది. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులు ఉన్నతాధికారులకు మొర పెట్టుకుంది. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.
మాస్క్‌లేదని
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో బారదరి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన కొడుకుని పోలీసులు పట్టుకెళ్లారని... అతని కోసం పోలీస్ పోస్ట్‌కి వెళిప్పటికే తన కొడుకుని వేరే ప్రాంతానికి తరలించారని బాధిత మహిళ ఆరోపిస్తోంది. కొన్ని గంటల పాటు ఆ ప్రాంతలో వెతికితే తీవ్ర గాయలపాలైన కొడుకు కనిపించాడని ఆమె పేర్కొంది. ముఖానికి మాస్కు పెట్టుకోలేదనే కారణంతో తన కొడుకు చేతులు, కాళ్లకు పోలీసులు మేకులు దించారని ఆరోపించింది.
తప్పుడు ఆరోపణలు
ఈ ఆరోపణలపై బరేలీ పోలీసులు స్పందించారు. తమపై ఫిర్యాదు చేసిన మహిళ కొడుకుపై అనేక కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసుల విచారణ తప్పించుకునేందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వివరణ ఇచ్చారు
Comments
Please login to add a commentAdd a comment