కోల్‌కతా: మాస్కులందు ఎల్ఈడీ మాస్కులు వేరయా! అవును.. ఈ వార్త చదివితే బహుశా మీరు కూడా ఇదే అంటారు కాబోలు. మార్కెట్లో రకరకాల మాస్కులు చూశాం. కాటన్ నుంచి బంగారంతో తయారు చేసిన మాస్కులన్నింటి గురించి విన్నాం, చూశాం.. ఇప్పుడు లేటెస్ట్‌గా మరో వెరైటీ మాస్కు మార్కెట్లోకి దిగింది. అదే రంగురంగుల లైట్లను విరజిమ్ముతున్న "ఎల్ఈడీ మాస్క్". పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌర్ నాథ్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు. అయితే దీనివల్ల ఓ ప్రయోజనం ఉందంటున్నాడు. ఈ మాస్కు ధరించినవారిని చూస్తేనైనా నిర్లక్ష్యంగా వ్యవహరించే కొందరికి మాస్కు పెట్టుకోవాలన్న విషయం గుర్తుకు వస్తుందని చెప్పుకొచ్చాడు. ఆ విధంగా ఎల్ఈడీ మాస్కు ప్రజల్లో అవగాహనను పెంచుతుందంటున్నాడు. (ఒక్క రాముడేంటి, అన్ని గ్రహాలు నేపాల్‌వే..)
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాస్కు అందాన్ని దాచేస్తోందని బాధపడేవారికి ఈ మాస్కు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే ఎంతమందిలో ఉన్నా ఈ మాస్కు పెట్టుకుంటే మిమ్మల్ని ఇట్టే గుర్తించొచ్చు. మరోవైపు సూరత్‌లో ఓ వజ్రాల వ్యాపారి వజ్రాలు పొదిగిన మాస్కులను అమ్ముతున్న విషయం తెలిసిందే. మరికొందరు బంగారం మీద ఉన్న మోజుతో బంగారు మాస్కులు తయారు చేయించుకుని పెట్టుకుంటున్నారు. ఏదైతేనేం.. కరోనా రాకుండా కాపాడే మాస్కు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్ అయిపోయింది. (గోల్డ్‌మేన్.. మూతికి బంగారు మాస్కు)
Comments
Please login to add a commentAdd a comment