women arrest
-
బంజారహిల్స్‌లో భారీ దొంగతనం.. వజ్రాలు, బంగారం మాయం
హైదరాబాద్: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళ కోసం బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. వివరాలివీ... బంజారాహిల్స్ రోడ్ నెం. 8లోని వైట్‌హౌస్ సెలెస్టియా అపార్ట్‌మెంట్స్‌లో నివసించే కొడాలి ధనలక్ష్మి అక్టోబర్ 16వ తేదీన మంగోలియా దేశం విజిట్చేసేందుకు బ్యాగులో మూడు వజ్రాలు పొదిగిన గాజులు, ఒక బంగారు గాజు, మరో వాచీని సర్దుకుంది. ఆ బ్యాగు తీసుకొని మంగోలియా యాత్రకు వెళ్లిది. అక్కడికి చేరిన తర్వాత బ్యాగు తెరిచి చూడగా అందులో ఉండాల్సిన రూ. 10 లక్షల వజ్రాభరణాలు, వాచ్ కనిపించలేదు. ఈ నెల 24వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో చూడగా ఎక్కడా కనిపించలేదు. బ్యాంకు లాకర్లో కూడా దొరకలేదు. అయితే ఇంట్లో పని చేసే శ్రీలత అనే పనిమనిషి తాను మంగోలియా వెళ్లే సమయంలో బ్యాగును సర్దిందని ఆ సమయంలో వాటిని తస్కరించి ఉంటుందని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఉగాండా మహిళ పొట్టలో కేజీ కొకైన్
న్యూఢిల్లీ: ఉగాండా దేశానికి చెందిన మహిళ నుంచి సుమారు కిలో బరువున్న కొకైన్ అనే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ) కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికురాలు కొన్ని రోజుల క్రితం ఉగాండా నుంచి ఢిల్లీకి వచ్చింది. విమానాశ్రయంలో అధికారులు ఆమె కదలికలు, ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆమె క్యాప్యూళ్ల రూపంలో ఉన్న కొకైన్‌ను మింగినట్లు ఒప్పుకుంది. వెంటనే ఆస్పత్రిలో ఆమెకు పరీక్షలు చేయించగా అనేక క్యాప్యూళ్లు పెద్ద పేగు వద్ద చిక్కుకుని ఉన్నట్లు తేలింది. దీంతో నిపుణుల పర్యవేక్షణలో వాటన్నిటినీ బయటకు తీసేందుకు కొన్ని రోజులు పట్టింది. మొత్తం 992 గ్రాముల బరువున్న 91 క్యాప్సూళ్లు బయటపడ్డాయి. వీటిల్లో ఉన్నది సుమారు రూ.14 కోట్ల విలువైన కొకైన్ అని ధ్రువీకరించుకున్నారు. ఈ మేరకు సదరు మహిళను అరెస్ట్ చేసి, ఈనెల 29వ తేదీన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈనెల మొదటి వారంలో నైజీరియా మహిళ నుంచి ఐజీఐ అధికారులు 2,838 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసుల అదుపులో 44 మంది మహిళలు.. కువైట్ వెళ్తుండగా..
శంషాబాద్: ఏజెంట్లు తప్పుదారి పట్టించడంతో రెండు వీసాలతో కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించిన 44 మంది మహిళలు శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడ్డారు. వారిని ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గోవా రాష్ట్రాలకు చెందిన 44 మంది మహిళలు మంగళవారం తెల్లవారుజామున కువైట్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో మహిళలు ముందుగా విజిట్ వీసాలు చూపించారు. కువైట్‌కు ఎందుకు వెళ్తున్నారని అధికారులు ప్రశ్నించ గా కొందరు ఉపాధి నిమిత్తం వెళ్తున్నట్టు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు వారి వద్ద ఉన్న అన్ని పత్రాలను పరిశీలించారు. మహిళలందరి వద్ద విజిట్ వీసాలతో పాటు వర్క్ వీసాలు కూడా లభ్యమయ్యాయి. ఏజెంట్ల సాయంతో బయల్దేరి న మహిళలకు రెండు వీసాలతో వెళ్లడం నేర మని కూడా తెలియదు. ఉపాధి దొరుకుతుందన్న ఆశతో ఏజెంట్లు సమకూర్చిన రెండు వీసాలతో కువైట్‌కు బయల్దేరారు. వారంతా ఉపాధి నిమిత్తం వెళ్తున్న వారిగా నిర్ధారించుకున్న అధికారులు ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించగా దర్యాప్తు ప్రారంభించారు. వారికి తెలియకుండా.. మూడు రాష్ట్రాలకు చెందిన మహిళలందరు కూడా ఒకే విమానంలో కువైట్‌కు వెళ్లేందుకు వచ్చారు. వీరంతా ఆయా ప్రాంతాల సబ్‌ఏజెంట్లతో పాటు ప్రధాన ఏజెంట్లకు అనుసం ధానంగా వీసాలు పొందినట్లు పోలీసుల ద ర్యాప్తులో తేలింది. ప్రధాన ఏజెంట్ ముంబై కి చెందినట్టు గుర్తించారని సమాచారం. గతంలో కూడా సదరు ఏజెంట్ ద్వారా వెళ్లిన మహిళలు ఇదే తరహా మోసానికి గురయ్యా రు. ఒక్కొక్కరు సుమారు రెండు నుంచి రూ.3 లక్షల వరకు చెల్లించినట్లు సమాచారం. వీసాల్లో ఉన్న పొరపాట్లను మహిళలకు తెలియకుండానే ఏజెంట్లు ఈ వ్యవహారాన్ని నడిపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. విజిట్ వీసాను ఇక్కడ బయలుదేరే సమయంలో చూపించాలని, వర్క్ వీసాలను కు వైట్‌లో చూపించాలని మహిళలకు ఏజెంట్లు చెప్పినట్లు సమాచారం. మహిళల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల వారున్నారు. రెండు వీసాలు ఎందుకు..? పదో తరగతి కన్నా తక్కువ విద్యార్హత కలిగిన వారు కొన్ని దేశాల్లో ఉపాధి నిమిత్తం వెళ్లడానికి ఇమిగ్రేషన్ చట్టం 1983 ప్రకారం ఈసీఆర్ (ఇమిగ్రేషన్ చెకింగ్ రిక్వైర్డ్)లో భాగంగా ప్రొటెక్షన్ ఆఫ్ ఇమిగ్రేషన్ పత్రాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రక్రియను పూర్తి చేయకుండానే కార్మికులను పెద్ద ఎత్తున ఏజెంట్లు తరలిస్తుంటారు. అక్కడికి వెళ్లిన తర్వాత వర్కింగ్ వీసాలను వాడుకునేందుకు వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏజెంట్లపై కేసు ఉపాధి నిమిత్తం వెళ్తున్న మహిళలకు ఏజెంట్లు విజిట్ వీసాలు జారీ చేశారు. వర్కింగ్ వీసాలకు ఈసీ ఆర్ లేకుండా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే వారికి విజిట్ వీసాలతో పాటు వర్కింగ్ వీసాలు అందజేశారు. ఏజెంట్లపైనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మహిళలను బాధితులుగానే పరిగణిస్తున్నాం. – విజయ్‌కుమార్, సీఐ, ఆర్జీఐఏ అయోమయంగా ఉంది.. మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఉపా« ది నిమిత్తం కువైట్ వెళ్లడానికి వచ్చాం.. మా వద్ద రెండు వీసాలున్నాయని అధికారులు నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌కు పంపారు. గతంలో లాక్డౌన్లో కూడా వీసాలు రద్దయ్యాయి. ఇప్పుడేమో ఇలా.. అంతా అయోమయంగా ఉంది. – బాధిత మహిళ చదవండి: (Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం) -
కరోనా వ్యాప్తి.. ఆమెపై రెండు కేసులు
పెరంబూరు: సూర్యదేవిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. నటి వనితా విజయకుమార్ మూడో పెళ్లి చేసుకోవడంపై వీడియోల ద్వారా సూర్యదేవి విమర్శల దాడి చేసి వార్తల్లో నిలిచారు. ఈ నెల 22న వనితా ఫిర్యాదుతో వడపళని మహిళా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తరువాత నటి కస్తూరీ తన న్యాయవాది ద్వారా సూర్యదేవికి బెయిల్ ఇప్పించారు. (నటి వనితతో గొడవ, ఆ మహిళ ఎక్కడ?) కాగా అంతకు ముందు సూర్యదేవిని విచారించిన పోలీస్ అధికారికి కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీస్ అధికారి చెన్నై ఐఐటీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. సూర్యదేవి మాత్రం పరీక్షలు చేసుకోకుండా పరారీలో ఉన్నట్లు పోలీసులు ఆరోపించారు. తాను ఎక్కడికి వెళ్లలేదని సూర్యదేవి యూట్యూబ్‌లో వీడియో విడుదల చేశారు. కరోనా వ్యాప్తికి పాల్పడుతోందంటూ చేసిన ఫిర్యాదుపై విరుగంబాక్కమ్ పోలీసులు సూర్యదేవిపై రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆమె కోసం గాలిస్తున్నారు. -
టార్చ్‌లైట్ సినిమాలాగే మహిళను ఎరగా వేసి..
నెల్లూరు(క్రైమ్): జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళ మహిళను ఎరవేసి అటుగా రాకపోకలు సాగించే వాహనదారులను దోచేస్తున్న ముఠా గుట్టును నెల్లూరులోని వేదాయపాళెం పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని మహిళతోపాటు ప్రధాన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. వేదాయపాళెం పోలీసు స్టేషన్లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నగర డీఎస్పీ ఎన్‌బీఎం మురళీకృష్ణ వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల గ్రామానికి చెందిన మల్లి శ్రీనివాసులు అలియాస్ శ్రీను, అయ్యప్పగుడి టీచర్స్ కాలనీకి చెందిన వి.బాలవర్దన్ అలియాస్ బాలు అలియాస్ బాలాజీలు ఆటోడ్రైవర్లు. వీరు రాత్రి వేళల్లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో నడుపుతుండేవారు. రామ్‌నగర్‌కు చెందిన ఎం.అనిల్ రాత్రివేళల్లో నగరంలో తిరుగుతుండేవాడు. ఈక్రమంలో అతనికి శ్రీను, బాలవర్దన్‌లతో పరిచయమైంది. అనిల్ ద్వారా సంతపేటకు చెందిన రమాదేవి అలియాస్ రమ వారికి పరిచయమైంది. చెడువ్యసనాలకు అలవాటుపడిన వారికి ఆటో ద్వారా వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. దీంతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. రమాను ఎరగా వేసి జాతీయ రహదారిపై వాహనచోదకులను దోచేయాలని పథకం పన్నారు. మాటు వేసి.. జాతీయ రహదారిపై నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాన్ని అడ్డాగా చేసుకున్నారు. రాత్రి వేళల్లో నలుగురు కలిసి హైవేపైకి చేరుకుని రమాను నిలబెట్టేవారు. మిగిలిన వారు ఆటోలో చీకట్లో నక్కి ఉండేవారు. ఆమెను చూసి ఆకర్షితులైన లారీడ్రైవర్లు, ప్రయాణికులు వాహనాలు దూరంగా ఆపి దగ్గరికి వచ్చేవారు. ఆమె వారిని మాటల్లో దించి చెట్టు పొదల్లోకి తీసుకెళ్లేది. అప్పటికే అక్కడ మాటేసి ఉన్న శ్రీనివాసులు, బాలవర్దన్, అనిల్‌లు లారీడ్రైవర్, ప్రయాణికులపై దాడిచేసి నగదు, ఒంటిపై ఉన్న ఆభరణాలు దోచుకుని ఆటోలో పరారయ్యేవారు. దూర ప్రాంతాలకు చెందిన డ్రైవర్లు, ప్రయాణికులు ఈ విషయం బయటపడితే తమ పరువుపోతుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వెళ్లేవారు. దీంతో పోలీసుల దృష్టి ముఠాపై పడకపోవడంతో జాతీయ రహదారిపై వారు కొంతకాలంగా అనేకమంది దోపిడీ చేశారు. సమావేశంలో వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ మురళీకృష్ణ, చిత్రంలో సీఐ, ఎస్సై వెలుగులోకి ఇలా.. ఎప్పటిలాగే ముఠా సభ్యులు ఈనెల 7వ తేదీ తెల్లవారుజామున సుందరయ్యకాలనీ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో మాటేశారు. రమ రోడ్‌పై టార్చ్‌లైట్ పెట్టుకుని వాహనచోదకులను ఆకట్టుకునే పనిలో ఉంది. తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టు నుంచి జగయ్యపేటకు వెళుతున్న బొగ్గులోడు లారీ ఆ ప్రాంతానికి చేరుకుంది. రమాను చూసి ఆకర్షితుడైన డ్రైవర్ లారీ నుంచి కిందకుదిగి ఆమెతో మాట్లాడాడు. అనంతరం రమ సదరు లారీ డ్రైవర్‌ను సమీపంలోని ఖాళీ స్థలాలవైపు తీసుకెళ్లి మాట్లాడుతుండగా శ్రీనివాసులు, బాలవర్దన్, అనిల్‌లు అతనిపై దాడిచేశారు. రూ.5 వేల నగదు, వెండి బ్రాస్లెట్, ఉంగరం దోచుకుని అక్కడినుంచి అందరూ కలిసి ఆటోలో పరారయ్యారు. బాధిత డ్రైవర్ వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు సంఘటనపై కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున ఇన్స్పెక్టర్కు ఓ మహిళ, ముగ్గురు వ్యక్తులు ఆటోలో సుందరయ్యకాలనీ సమీప జాతీయ రహదారిపై అనుమానాస్పదంగా ఉన్నారని సమాచారం అందింది. దీంతో ఆయన తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు స్టేషన్‌కు తరలించి వారిని విచారించగా లారీ డ్రైవర్‌పై దాడిచేసి నగదు దోచుకెళ్లామని అంగీకరించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి దోపిడీ సొత్తుతోపాటు నేరాలకు ఉపయోగించిన ఆటోను స్వా«ధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. జాతీయ రహదారిపై ఇలాంటి మోసాలు అధికంగా జరిగే అవకాశం ఉందని వాహనచోదకులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. సమావేశంలో వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు, ఎస్సై పుల్లారెడ్డి, ఏఎస్సై ప్రసాద్, హెడ్‌కానిస్టేబుల్స్ సుధా, గోపాల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
పని చేసే ఇంటికే కన్నం
బంజారాహిల్స్: పని చేసే ఇంట్లోనే చోరీకి పాల్పడిన ఓ మహిళను బంజారాహిల్స్ క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనగర్‌కాలనీకి చెందిన కౌశిక్ సరౌగి అనే మహిళ ఇంట్లో షోలాపూర్‌కు చెందిన వర్షన్ సంజయ్‌గాంధీ అనే మహిళ ఏడాదిగా పని చేస్తోంది. నమ్మకంగా ఉండటంతో ఆమెకు యజమానురాలు పూర్తి బాధ్యతలు అప్పగించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న వర్షన్ సంజయ్ గాంధీ ఈ నెల 13న డూప్లికేట్ కీ సహాయంతో బీరువాలో ఉన్న వజ్రాల ఆభరణలు, బంగారు నగలు, ముత్యాల హారాలతో పాటు రూ.80 వేల నగదును దొంగిలించి తాను ఉంటున్న సర్వెంట్ క్వార్టర్లో గొయ్యి తీసి పూడ్చి పెట్టింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బంజారాహిల్స్ క్రైం పోలీసులు సీసీ ఫుటేజీలతోపాటు అనుమానితులను విచారించగా వర్షన్ చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది. దీనికితోడు ఈమె మూడు రోజుల క్రితమే తన క్వార్టర్ తాళం వేసి పరారు కావడంతో అనుమానం వచ్చిన పోలీసులు బంజారాహిల్స్‌లోనే ఓ ఇంట్లో తలదాచుకున్న నిందితురాలిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అమె వెల్లడించిన వివరాలు ఆధారంగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రూ. 5 లక్షల విలువ చేసే ఆభరణాలను నిందితురాలు తన స్వగ్రామానికి తరలించినట్లు వెల్లడైంది. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారుల కిడ్నాప్ కేసులో ఇద్దరు మహిళల అరెస్ట్
హస్తినాపురం: ఇంటిముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేసి రూ.10 వేలకు విక్రయించిన కేసులో ఇద్దరు నిందితులను బాలాపూర్ పోలీసులు ఆరు గంటల్లో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం వనస్థలిపురం ఏసీపీ గాంధీనారాయణ సీఐ సైదులుతో కలిసి వివరాలు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా, కాకర్లపాడుకు చెందిన నర్సింహులు, శోభ దంపతులు తమ ముగ్గురు కుమార్తెలు లోఖిత(10),శ్రీవాణి(7),సాయిప్రియ(4)లతో కలిసి బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటూ కూలీలుగా పని చేస్తున్నారు. వీరి ఇంటి సమీపంలో ఉంటున్న మంగ అనే మహిళ నగరంలోని ప్రధాన కూడళ్లలో చిన్నారులతో భిక్షాటన చేయిస్తూ ఉంటుంది. సూరారం కాలనీలో ఉంటున్న ఆమె బంధువు అనితకు పిల్లలు లేకపోవడంతో మంగను సంప్రదించింది. తాను పిల్లలను తీసుకువస్తానని రూ. 10 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న మంగ అడ్వాన్స్ తీసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం ఇంటి ముందుకు ఆడుకుంటున్న లోఖిత, సాయిప్రియలకు చాక్లెట్లు, ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానని ఆశచూపిన మంగ వారిని ఆటోలో తీసుకుని వెళ్లింది. పిల్లలు కనిపించకపోవడంతో నర్సింహ్మ దంపతులు బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు మంగపై అనుమానంతో సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఉప్పల్ సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా అనితను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఇద్దరు చిన్నారులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఆ అభ్యర్థికి ఓటెయ్యొద్దు.. పాదరక్షలు తుడుస్తూ ప్రచారం
టీ.నగర్: శ్రీరంగం ఆలయంలో భక్తుల పాదరక్షలు తుడుస్తూ వినూత్న ప్రచారం చేపట్టిన మహిళను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. తిరుచ్చి శ్రీరంగం ఆలయానికి గురువారం భక్తులు వస్తుండగా అక్కడ వీధిలో కూర్చున్న ఒక మహిళ వస్తున్న భక్తుల పాదరక్షలను తుడుస్తూ వచ్చింది. ఆ సమయంలో ఆమె తిరుచ్చి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయవద్దని అభ్యర్థిస్తూ ప్రచారం సాగించింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ వర్గాలు అక్కడికి వచ్చి మహిళతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న శ్రీరంగం పోలీసులు మహిళను పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. సదరు మహిళ చెన్నై అన్నానగర్‌కు చెందిన నర్మద నందకుమార్‌గా తెలిసింది. ఇలావుండగా కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు శరణన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నర్మదపై మూడు సెక్షన్లలో కేసు నమోదు చేశారు. తర్వాత ఆమెను తిరుచ్చి మహిళా జైలులో నిర్బంధించారు. ముందుగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ కూటమికి ప్రచారం చేస్తున్న వీరమణి కృష్ణ భగవానున్ని కించపరుస్తూ ప్రసంగాలు చేస్తున్నారని, దైవదూషణ కారణంగా ఈ ఏడాది కూడా రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడకూడదనే ఉద్దేశంతో తిరుచ్చి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి తిరునావుక్కరసర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ భక్తుల పాదరక్షలు తుడుస్తానని మొక్కుకున్నట్లు తెలిపారు. -
అన్నం పెట్టే మహిళలను అరెస్టులు చేస్తారా?
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు గౌతమ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన పథకం కార్మికులను పోలీసులు జలియన్ వాలాబాగ్ తరహాలో పాశవికంగా అరెస్ట్‌లు చేశారని విమర్శించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం మధ్యాహ్న బోజన కార్మికులు చేపట్టిన ఆందోళనలను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేయాలని చూడటాన్ని దుర్మార్గపు చర్యగా ఆయన అభివర్ణించారు . 85 వేల మందిని విధుల నుంచి తొలగించడం దారుణమని మండిపడ్డారు. వారికి తాము అండగా ఉంటామని తెలిపారు. అన్నం పెట్టే మహిళలను ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయవాడలోని అన్ని పోలీసు స్టేషన్లు మహిళలతో నిండిపోయాయని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుకు మొదటి నుంచి కార్మికుల అంటే చిన్నచూపేనని అన్నారు. దుర్గగుడిలో అమ్మవారికే రక్షణ కరువయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కిరీటం మాయం అయిందని, తర్వాత క్షుద్రపూజలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. అమ్మవారి చీర మాయంపై అదే గుడి కమిటీ సభ్యులు విచారణ జరపడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘ఛలో విజయవాడ కార్యక్రమం’లో ఉద్రిక్తత -
ప్రదర్శనలో సింగర్‌ను కౌగిలించుకుందని..
-
మద్యంపై ప్రశ్నించిన మహిళలు అరెస్ట్
కదిరి : పట్టణంలోని కందికుంట నారాయణమ్మ కాలనీలో గుడి పక్కన, మసీదుకు కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణం ఎత్తి వేయాలని శనివారం ఆ దుకాణం ముందు నిరసన తెలిపిన ఐద్వా మహిళలను కదిరి పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అంతకు మునుపు వారు చంద్రబాబు సర్కారుపై మండిపడ్డారు. అరెస్ట్ అయిన వారిలో ఐద్వా సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరలక్ష్మి, పద్మావతమ్మ, కుషీదా, పార్వతమ్మ, ఎల్లమ్మ, కళావతమ్మ, లక్ష్మిదేవి, భవాణి ఉన్నారు. -
'ఆ టెలిస్కోప్ మాకు వద్దే వద్దు'
హొనోలులు: హవాయిలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాము ఎంతో పవిత్రంగా భావించే హవాయి పర్వతంపై టెలిస్కోప్ ఏర్పాటుచేయడానికి తాము ఒప్పుకోబోమంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తితోపాటు ఏడుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. హవాయి పర్వతం మీద మొత్తం 30 మీటర్ల వ్యాసార్థంతో ఓ భారీ టెలిస్కోప్ ను ఏర్పాటుచేయనున్నారు. దీంతో మౌనాకియా అనే ప్రాంతాన్ని ది స్టేట్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ నేచురల్ రిసోర్సెస్ డిపార్ట్ ఆధీనంలోకి తీసుకుంది. దాని చుట్టుపక్కల ఓ నియంత్రణ కంచెను ఏర్పాటుచేసి అటుపక్క ఎవరూ రాకుండా ముఖ్యంగా రాత్రి వేళ ఎవరూ సంచరించకుండా గస్తీ దళాన్ని కూడా పెట్టింది. అయితే, తాము పవిత్రంగా భావించే పర్వతాన్ని అధిరోహించకుండా చేస్తున్నారని, తమ సెంటిమెంట్ ను గౌరవించకుండా టెలిస్కోప్ ఏర్పాటుచేస్తున్నారని ఆందోళన ఉదృతం చేస్తున్నారు. గత అర్థ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మౌనాకియా వద్దకు కొందరు ఆందోళనకారులు చేరుకోగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, అరెస్టయిన వ్యక్తి బెయిల్ ఖర్చు రూ.70 వేలు ఉండగా మహిళల బెయిల్ కోసం ఒక్కొక్కరు దాదాపు 15 వేల రూపాయలకు పైగా చెల్లించాలని అధికారులు తెలిపారు. టెలిస్కోప్ నిర్మాణ పనులు గత ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి.