నిందితురాలు వర్షన్ సంజయ్‌గాంధీ
బంజారాహిల్స్: పని చేసే ఇంట్లోనే చోరీకి పాల్పడిన ఓ మహిళను బంజారాహిల్స్ క్రైం పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీనగర్‌కాలనీకి చెందిన కౌశిక్ సరౌగి అనే మహిళ ఇంట్లో షోలాపూర్‌కు చెందిన వర్షన్ సంజయ్‌గాంధీ అనే మహిళ ఏడాదిగా పని చేస్తోంది. నమ్మకంగా ఉండటంతో ఆమెకు యజమానురాలు పూర్తి బాధ్యతలు అప్పగించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న వర్షన్ సంజయ్ గాంధీ ఈ నెల 13న డూప్లికేట్ కీ సహాయంతో బీరువాలో ఉన్న వజ్రాల ఆభరణలు, బంగారు నగలు, ముత్యాల హారాలతో పాటు రూ.80 వేల నగదును దొంగిలించి తాను ఉంటున్న సర్వెంట్ క్వార్టర్‌లో గొయ్యి తీసి పూడ్చి పెట్టింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బంజారాహిల్స్ క్రైం పోలీసులు సీసీ ఫుటేజీలతోపాటు అనుమానితులను విచారించగా వర్షన్ చోరీకి పాల్పడినట్లు వెల్లడైంది. దీనికితోడు ఈమె మూడు రోజుల క్రితమే తన క్వార్టర్ తాళం వేసి పరారు కావడంతో అనుమానం వచ్చిన పోలీసులు బంజారాహిల్స్‌లోనే ఓ ఇంట్లో తలదాచుకున్న నిందితురాలిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అమె వెల్లడించిన వివరాలు ఆధారంగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. రూ. 5 లక్షల విలువ చేసే ఆభరణాలను నిందితురాలు తన స్వగ్రామానికి తరలించినట్లు వెల్లడైంది. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment